'కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు' | cpi leader chada venkat reddy comments on reorganization of districts in telangana | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు'

Sep 3 2016 4:13 PM | Updated on Sep 4 2017 12:09 PM

'కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు'

'కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు'

తెలంగాణలో జిల్లాల పునర్విభజన ఏకపక్షంగా జరుగుతోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల పునర్విభజన ఏక పక్షంగా జరుగుతోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. 371డి ఆర్టికల్ జోనల్ విధానాన్ని విస్మరించడం సరికాదని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇబ్బంది కలగకుండా జిల్లాల ఏర్పాటు జరగాలని సూచించారు. గద్దాల, జనగామ, ఎల్లంపల్లి, రామగుండంను జిల్లా కేంద్రాలుగా చేయాలన్నారు. 15 రోజుల్లో మరోసారి ఆల్ పార్టీ మీటింగ్ హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని చాడ వెంకటరెడ్డి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement