నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.
పిల్లలు లేరని దంపతుల ఆత్మహత్యాయత్నం
Mar 2 2017 4:33 PM | Updated on Jul 10 2019 8:02 PM
- చికిత్స పొందుతూ భర్త మృతి
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన మేకల రవి, సుశీల భార్యాభర్తలు. పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో ఇద్దరూ గురువారం పురుగుల మందు తాగి దగ్గరలో ఉన్న చెరువులో దూకారు. గమనించిన స్థానికులు వారిని రక్షించి 108 వాహనంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త రవి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Advertisement


