కాంగ్రెస్ జోరు.. బీజేపీ బేజారు | Congress registers impressive performance in the municipal council and nagar panchayat polls | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ జోరు.. బీజేపీ బేజారు

Jan 12 2016 11:06 AM | Updated on Mar 18 2019 7:55 PM

సంబరాల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు - Sakshi

సంబరాల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు

మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో అధికార బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కౌవసం చేసుకుంది.

- మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
- నాలుగో స్థానానికి పడిపోయిన అధికార బీజేపీ
- రెండు, మూడో స్థానాల్లో ఎన్సీపీ, శివసేన

ముంబై:
మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో అధికార బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. రాష్ట్రంలోని ఏడు నగర పంచాయితీలు, ఒక కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల పూర్తి ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడ్డాయి. మొత్తం 345 వార్డులకుగానూ కాంగ్రెస్ 105 వార్డుల్ని గెలుచుకుని సత్తాచాటింది. 80 వార్డుల్లో విజయం సాధించిన ఎన్సీపీ రెండో స్థానంలో, 59 చోట్ల గెలిచిన శివసేన మూడోస్థానంలో నిలిచాయి. బీజేపీ కేవలం 39 స్థానాలకే పరిమితమై పరువు పోగొట్టుకుంది.

చాలా కాలం తర్వాత సొంతగా పోటీచేసి, విజయం సాధించడంతో మహారాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. బీజేపీ- శివసేన సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనేందుకు నిదర్శనమే ఈ ఫలితాలని ప్రతిపక్ష నేత విఖే పాటిల్ అన్నారు. అధికారంలో ఉండికూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘర ఓటమి బీజేపీ శ్రేణుల్ని కలవరపాటుకుగురిచేసింది. తాజా ఫలితాలతో ఊపుమీదున్న కాంగ్రెస్ శ్రేణులు జనవరి 15, 16న ముంబై పర్యటనకు రానున్న రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నద్ధులవుతున్నారు.

రాయ్ గఢ్, నందూర్బర్, అహ్మద్ నగర్, నాందేడ్, ఉస్మానాబాద్, హింగోలి, వషీం నగర పంచాయితీలతోపాటు చంద్రాపూర్ కౌన్సిల్ కు గత వారంలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ లో 59 నగర పంచాయితీలు, ఒక కౌన్సిల్ క జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యథిక స్థానాలు కౌవసం చేసుకుంది. అప్పుడు రెండో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ మంగళవారంనాటి ఫలితాల్లో అనూహ్యంగా బలం పుంజుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement