సాగునీటి సమీక్షలా? టీఆర్‌ఎస్‌ సమావేశాలా? | congress leader vamshi chand reddy slams minister harish rao | Sakshi
Sakshi News home page

సాగునీటి సమీక్షలా? టీఆర్‌ఎస్‌ సమావేశాలా?

Feb 25 2017 2:42 PM | Updated on Sep 5 2017 4:35 AM

మంత్రి హరీష్‌ రావు చేపడుతున్న సాగునీటి సమీక్షలు టీఆర్‌ఎస్‌ సమావేశాలుగా మారయని ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్‌: నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు చేపడుతున్న సాగునీటి సమీక్షలు టీఆర్‌ఎస్‌ సమావేశాలుగా మారయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అవనీతి, అవకతవకలపై ప్రశ్నిస్తామనే భయంతో ప్రతిపక్ష సభ్యులకు ఆహ్వానాలు పంపడం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు సైట్ల వద్ద బహిరంగ చర్చకు సిద్ధంకండి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ప్రాజెక్టు సైట్ ల వద్దే బహిరంగ చర్చలు నిర్వహించింది. సీఎం దృష్టిలో అందరినీ కలుపుకొని పోవడం అంటే విపక్ష సభ్యులను టీఆర్ఎస్ లో చేర్చుకోవడమా అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement