
భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఆరా
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఆరా తీశారు.
అధికారులు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, అన్ని శాఖల సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అంటురోగాలు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.