జర్నలిస్టులకు చంద్రబాబు క్షమాపణ | Chandra babu says apollogies to scribes | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు చంద్రబాబు క్షమాపణ

Sep 24 2016 12:31 PM | Updated on Aug 20 2018 2:50 PM

జర్నలిస్టులకు చంద్రబాబు క్షమాపణ - Sakshi

జర్నలిస్టులకు చంద్రబాబు క్షమాపణ

పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంది. ర్యాలీలో మీడియా కెమెరామన్లపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దాంతో పలువురు కెమెరామన్లు కింద పడిపోయారు.

తమ కెమెరామన్లు కింద పడిపోవడంతో.. ఆగ్రహించిన జర్నలిస్టులు ఉన్నట్టుండి చంద్రబాబు ర్యాలీని అడ్డుకుని ధర్నా చేశారు. దాంతో చంద్రబాబు అక్కడికి వెళ్లి.. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు. అనంతరం ర్యాలీని తిరిగి కొనసాగించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు చంద్రబాబు విజయవాడ నుంచి ఏలూరు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement