శశి మెడకు ఉచ్చు | Case against expelled AIADMK MP Sasikala for submitting forged documents for anticipatory bail | Sakshi
Sakshi News home page

శశి మెడకు ఉచ్చు

Sep 26 2016 2:30 AM | Updated on Apr 8 2019 7:05 PM

అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ సారి ఆమెను అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ సారి ఆమెను అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా కోర్టునే బురిడీ కొట్టించే యత్నం చేశారంటూ కేసు నమోదు కావడం గమనార్హం. అమ్మ జయలలిత ఆజ్ఞల్ని ధిక్కరించి రాజ్యసభ పదవిలో శశికళ పుష్ప కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించే పనిలో పడ్డ శశికళ పుష్ప కుటుంబానికి ముచ్చెమటలు పట్టించే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఆ కుటుంబం చేత మోసపోయామంటూ ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయించే పనిలో పడ్డారు.

ఇలా ఫిర్యాదులు హోరెత్తుతుండడంతో శశికళ పుష్ప ముందస్తు జాగ్రత్తలో పడ్డారు. ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ, ఢిల్లీలో మకాం వేశారు. రెండు సార్లు సుప్రీంకోర్టు ద్వారా అరెస్టు గండం నుంచి బయట పడ్డ శశికళ పుష్ప, ఈ సారి పోలీసుల చేతికి చిక్కినట్టే . ఇందుకు కారణం ముందస్తు బెయిల్ కోసం మదురై ధర్మాసనంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లోని సంతకాలు, ఇతర డాక్యుమెంట్లు నకిలీవిగా తేలడమే. ఇక, తూత్తుకుడిలో ఎంపీ ఇంట్లో పనిచేస్తున్న భానుమతి, ఝాన్సీరాణి ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు శశికళ, ఆమె భర్త, కుమారుడి మెడకు చుట్టుకున్న విషయం తెలిసిందే.

ఈ కేసు నుంచి బయట పడేందుకు ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేసి మదురై ధర్మాసనంకు ఎంపీ అండ్ ఫ్యామిలీ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాయి. దీంతో వారు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని తీవ్రంగానే పరిశీలించిన పోలీసులు కోర్టునే బురిడి కొట్టించే యత్నం, మోసగించే విధంగా వ్యవహరించడం వంటి సెక్షన్ల కింద ఆదివారం కేసులు నమోదు చేశారు. వ్యవహారం కోర్టుకు సంబంధించిన దృష్ట్యా, కేసులో ఎంపీ శశికళను అరెస్టు చేయడానికి తగ్గట్టుగా పోలీసులు తీవ్రంగానే ప్రయత్నాల్లో ఉండడం ఆలోచించాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement