ప్రేమజంటపై దాడి | attack on love pair | Sakshi
Sakshi News home page

ప్రేమజంటపై దాడి

Aug 10 2015 8:52 AM | Updated on Sep 3 2017 7:10 AM

ప్రేమజంటపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఐదుగురి అరెస్ట్


 తిరువొత్తియూరు: ప్రేమజంటపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా కుంభకోణం, కల్లూర్ మట్టియూర్‌కు చెందిన అయ్యప్పన్ (21). ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థ ఉద్యోగి. ఇతను తన సంస్థలో పని చేస్తున్న యువతితో కలసి శుక్రవారం రాత్రి స్వామిమలై ఆలయానికి వెళ్లాడు. తిరిగి కుం భకోణం వచ్చారు. ఆ యువతిని బస్సులో బస్సు ఎక్కించేందుకు అంజూర్ బైపాస్‌రోడ్డులో వేచి ఉ న్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఐదుగురు మద్యం మత్తులో వారిని అడ్డుకుని వారిపై దాడి చేసి ఆ యువతి వద్ద అసభ్యంగా ప్రవర్తించారు. ఈ లోపు ఒక కారు వస్తుండడం చూసి దుండగులు దూరంగా వెళ్లారు.

 

యువతిని అయ్యప్పన్ బస్సులో ఎక్కించి తిరిగి బైకు తీయడానికి బైకు వద్దకు వచ్చా డు. తిరిగి అతని వద్దకు వచ్చిన ఐదుగురు యువతిని తీసుకురమ్మని గొడవ చేసి అతని వద్ద నున్న సెల్‌ఫోన్, ఏటీఎం కార్డును లాక్కున్నారు. దీనిపై అయ్యప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కుంభకోణం కొట్టయూరుకు చెందిన కళాశాల విద్యార్థులు విఘ్నేష్ (21), ఆనంద్ (24), రాంకి (24), కరుప్పన్ (22), అరుణ్ కుమార్ (21) అనే ఐదుగురిని అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement