గాయని బంగ్లాకు భారీ కరెంటు బిల్లు | Asha Bhosle receives Rs 53,000 electricity bill for ‘locked’ Lonavala bungalow | Sakshi
Sakshi News home page

గాయని బంగ్లాకు భారీ కరెంటు బిల్లు

Dec 7 2016 4:37 PM | Updated on Oct 8 2018 6:22 PM

గాయని బంగ్లాకు భారీ కరెంటు బిల్లు - Sakshi

గాయని బంగ్లాకు భారీ కరెంటు బిల్లు

ప్రముఖ సినీ గాయని ఆశా బోంస్లేకు మహారాష్ట్ర ఎలక్ట్రసిటీ షాక్ ఇచ్చింది.

ముంబై: ప్రముఖ సినీ గాయని ఆశా బోంస్లేకు మహారాష్ట్ర ఎలక్ట్రసిటీ షాక్ ఇచ్చింది. భోంస్లేకు చెందిన బంగ్లాకు రూ. 53 వేల కరెంటు బిల్లును పంపారు. అయితే  విద్యుత్ బిల్లు రూ. 53 వేలు రావడంతో ఆమె ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆ బంగ్లా వినియోగంలో లేదు. అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో బిల్లు రావడమేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా భోంస్లేకు నగరానికి 100 కి.మీ.దూరంలో ఉన్న లోణావాల స్టేషన్ సమీపంలో లేక్ రోడ్డుపై విలాసవంతమైన బంగ్లా ఉంది. చాలా కాలంగా ఆమె ఆ బంగ్లాలో ఉండటం లేదు. ఒకవేళ వెళ్లినా ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటారు . దీంతో ఎక్కువ భాగం  బంగ్లా మూసి ఉంటుంది.
 
కానీ ఇటీవల విద్యుత్ శాఖ రూ. 16,411 బిల్లు పంపించారు. అంతే గాకా గత బిల్లు బకాయిలు రూ.37,168లతో మొత్తం రూ. 53,759 బిల్లు జారీ చేసింది. దీంతో షాక్ కు గురైన బోంస్లే వెంటనే ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అభ్యర్థనకు స్పందించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులను దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కంప్యూటరైజ్డ్ విద్యుత్ బిల్లుల వల్ల ఈ పొరపాటు జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement