పెట్రోల్‌ బంక్‌లో నీరు కలిసిన పెట్రోల్‌ | Adulterated Petrol Sale in Karnataka | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంక్‌లో ‘వాటర్‌’

Jan 8 2020 7:48 AM | Updated on Jan 8 2020 7:48 AM

Adulterated Petrol Sale in Karnataka - Sakshi

పెట్రోల్‌ బాటిళ్లతో ఆందోళన చేస్తున్న వినియోగదారులు, నీరు కలిసిన పెట్రోల్‌

ఎక్కడివక్కడ నిలిచిపోయిన వాహనాలు

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పెట్రోల్‌ బంక్‌ పంపుల్లో నీరు మిశ్రిత పెట్రోల్‌ రావడంతో పెట్రోల్‌ కొట్టించుకున్న వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయి వినియోగదారులు తీవ్ర ఇబ్బందికి గురైన సంఘటన దేవనహళ్లి శివారులోని ఓ పెట్రోల్‌ బంక్‌లో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుండి వచ్చిన మంజునాథ్‌ అనే వ్యక్తి తన కారుకు ఇదే పెట్రోల్‌ బంక్‌లో పెట్రోలు కొట్టించాడు. కాస్త దూరం వెళ్లిన కారు నిలిచిపోయింది. మెకానిక్‌ను రప్పించి చెక్‌ చేయిస్తే పెట్రోల్‌లో నీరు కలిసిందని చెప్పాడు.

మంజునాథ్‌ బంకు దగ్గరుకు వెళ్లేసరికి ఇంకా కొందరు వాహనదారులు అప్పటికే బంక్‌ దగ్గర సిబ్బందితో గొడవపడుతున్నారు. దీంతో వినియోగదారులు పెట్రోల్‌ బాటిళ్లతో బంక్‌ దగ్గరే ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న బంకు యజమాని వచ్చి చెడిపోయిన వాహనాలను రిపేరీ చేయిస్తానని హామీ ఇవ్వడంతో వినియోగదారులు ఆందోళన విరమించారు. పెట్రోల్‌లో నీరు ఎలా కలిసిందనే విషయంపై యజమాని ఆరా తీస్తున్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement