పెళ్లిపీటలెక్కిన హీరోయిన్ | actress nazriya marriage | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలెక్కిన హీరోయిన్

Aug 22 2014 8:43 AM | Updated on Apr 3 2019 8:58 PM

పెళ్లిపీటలెక్కిన హీరోయిన్ - Sakshi

పెళ్లిపీటలెక్కిన హీరోయిన్

యువ నటి నజ్రియా పెళ్లిపీటలెక్కారు.

చెన్నై: యువ నటి నజ్రియా పెళ్లిపీటలెక్కారు. తమిళంలో నేరం చిత్రం ద్వారా పరిచయం అయిన నటి మలయాళ నటి నజ్రియా నజీమ్. రాజారాణి, నయ్యాండి, తిరుమణం ఎనుమ్ నిఖా తదితర చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టికి మలయాళ యువ నటుడు, దర్శకుడు ఫాజిల్ కొడుకు అయిన పాహత్ ఫాజిల్‌తో వివాహం గురువారం కేరళలో ఘనంగా జరిగింది. అయితే బుధవారం తిరువనంతపురం సమీపంలోని కోవళంలో గల నక్షత్ర హోటల్లో వీరి మెహందీ వేడుక జరిగింది.
 
 ఈ కార్యక్రమంలో బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. నటి కావ్యా మాధవన్ మీరానందన్, మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ తదితర సినీ సన్నిహితులు పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరువనంతపురంలోని కల్యాణ మండపంలో పాహత్ ఫాజిల్, నజ్రియాల వివాహం ముస్లిం సంప్రదాయ బద్దంగా జరిగింది. ఈ వివాహానికి సన్నిహిత బంధు మిత్రులే పాల్గొన్నారు. దీంతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement