ఆస్పత్రిలో నటి కుష్బూ | Actress Kushboo Join In Hospital With Illness | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో నటి కుష్బూ

May 24 2019 11:08 AM | Updated on May 24 2019 11:08 AM

Actress Kushboo Join In Hospital With Illness - Sakshi

నటి కుష్బూ అనూహ్యంగా అనారోగ్యానికి గురై బుధవారం చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.

పెరంబూరు: నటి కుష్బూ అనూహ్యంగా అనారోగ్యానికి గురై బుధవారం చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. నటి కుష్బూ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారకర్త కూడా అన్నది తెలిసిందే. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఈమె తన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య పదవిలో ఉన్న తాను లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టీవీ చర్చల్లో పాల్గొనవలసి ఉండగా ఇలా ఆస్పత్రిలో చేరడం బాధగా ఉందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement