కోలుకుంటున్న నాజర్ కుమారుడు | Actor Nasser's son Faisal recovering | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న నాజర్ కుమారుడు

May 24 2014 8:31 AM | Updated on Aug 30 2018 3:58 PM

కోలుకుంటున్న నాజర్ కుమారుడు - Sakshi

కోలుకుంటున్న నాజర్ కుమారుడు

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటుడు నాజర్ కుమారుడు ఫైజల్ కోలుకుంటున్నాడు.

చెన్నై : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటుడు నాజర్ కుమారుడు ఫైజల్ కోలుకుంటున్నాడు. తన స్నేహితులతో కలిసి అతను గురువారం పుదుచ్చేరి నుంచి చెన్నైకు కారులో వస్తుండగా ట్యాంకర్ లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చెందగా, ఫైజల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగినప్పుడు ఫైజల్ కారు వెనుక సీటులో కూర్చున్నాడు.

ప్రస్తుతం అతడు కేలంబాక్కంలోని చెట్టినాడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫైజల్ ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సకు అతని శరీరం సహకరిస్తున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కాగా ఫైజల్ తమిళ చిత్రం 'శివం'కు  గ్రాఫిక్ డిజైనర్ గా  పని చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement