చెరువులో మునిగి ముగ్గురు యువకుల మృతి | 3 students drown while swimming yadadri district | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి ముగ్గురు యువకుల మృతి

May 8 2017 2:20 PM | Updated on Sep 5 2017 10:42 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎండవేడిమికి తట్టుకోలేక చెరువులో ఈతకెళ్ళిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని వలిగొండ మండలం జంగారెడ్డిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. మృతులను సాయివినాస్(16), గణేష్(18), శ్రీకాంత్(19)లుగా గుర్తించారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత‍్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గ్రామస్తులు చెరువు వద‍్దకు చేరి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement