రెండు బైక్‌లు ఢీ: ముగ్గురికి గాయాలు | 3 injured in road accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ: ముగ్గురికి గాయాలు

Sep 23 2016 2:54 PM | Updated on Aug 30 2018 4:10 PM

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

గిద్దలూరు: ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేట సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక చొల్లవీడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుజాత, ఆమె భర్త సంపత్‌ తో కలసి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా మరో బైక్‌పై వచ్చిన వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement