ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఇద్దరి మృతి
Jan 30 2017 12:14 PM | Updated on Aug 30 2018 4:10 PM
కడ్తాల్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామును చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో.. బైక్‌పై ఉన్న శ్రీనివాస్, శేఖర్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


