12 చోట్ల నేడు రీపోలింగ్ | 12 places ripoling today | Sakshi
Sakshi News home page

12 చోట్ల నేడు రీపోలింగ్

Apr 29 2014 3:23 AM | Updated on Sep 2 2017 6:39 AM

రాష్ర్టంలో 12 బూత్‌లలో మంగళవారం రీపోలింగ్‌ను చేపట్టనున్నారు. ఈ నెల 17న పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించడం, ఒక చోట పోలింగ్ సిబ్బంది తప్పిదాల...

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో 12 బూత్‌లలో మంగళవారం రీపోలింగ్‌ను చేపట్టనున్నారు. ఈ నెల 17న పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించడం, ఒక చోట పోలింగ్ సిబ్బంది తప్పిదాల వల్ల రీపోలింగ్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా సోమవారం తెలిపారు. మొత్తం తొమ్మిది లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు రీపోలింగ్‌ను నిర్వహించనున్నారు.

హావేరి నియోజక వర్గంలోని రాణిబెన్నూరు, బాలగలకోటెలోని జమఖండి, బాగలకోటె, బిజాపురలోని సిందగి, గుల్బర్గలోని సేడం, రాయచూరులోని షాపూర్, యాదగిరి, బీదర్‌లో రెండు, శివమొగ్గలోని బైందూరు, హాసనలోని అరసికెరె, తుమకూరు నియోజక వర్గంలోని తురువెకెరె బూత్‌లలో రీపోలింగ్ జరుగనుంది. కాగా రాష్ట్రంలో ఒకే దశలో ఈ నెల 17న ముగిసిన ఎన్నిక్లలో 67.3 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement