
సాక్షి, నెల్లూరు: మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. అనిల్ కుమార్‌పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇదే సమయంలో అనిల్ కుమార్‌కు మద్దతు తెలుపుతూ డీఎస్పీ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేరుకున్నారు.
వివరాల ప్రకారం.. కొవ్వూరులో వైఎస్సార్‌సీపీ సమావేశంలో పాల్గొన్నందుకు, ప్రశాంతి రెడ్డి ఎపిసోడ్‌పై అనిల్ కుమార్ మాట్లాడినందుకు ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, అనిల్ కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. కాసేపట్లి క్రితమే నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసుకు అనిల్ వచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేరుకున్నారు. అనంతరం, వారినివ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.