కర్నూలు జిల్లా లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు.
కర్నూలు జిల్లా తుగ్గలి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది కర్ణాటక వాసులు గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం హెబ్బళి సమీపంలోని దాసనహళ్లికి చెందిన పది మంది టయోటా కారులో మంత్రాలయం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. వారి వాహనాన్ని తుగ్గలి మండల కేంద్రం సమీపంలో పత్తికొండ నుంచి గొర్రెల లోడుతో వస్తున్న టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 10మంది గాయాలపాలయ్యారు. వారిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.