యువరాజ్ తండ్రికి కూడా క్యాన్సర్ | Yuvi's dad diagnosed with throat cancer | Sakshi
Sakshi News home page

యువరాజ్ తండ్రికి కూడా క్యాన్సర్

Jun 5 2014 5:44 PM | Updated on Sep 2 2017 8:21 AM

యువరాజ్ తండ్రికి కూడా క్యాన్సర్

యువరాజ్ తండ్రికి కూడా క్యాన్సర్

యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ టెస్ట్ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ కి క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది.

కష్టాలు సిక్సర్ ధీరుడు యువరాజ్ ను వదలడం లేదు. ప్రాణాంతక క్యాన్సర్ ను జయించిన యువరాజ్ సింగ్ కి ఇప్పుడు మరో షాక్ ఎదురైంది. ఆయన తండ్రి, మాజీ టెస్ట్ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ కి క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. ఆయన గొంతు క్యాన్సర్ ఉన్నట్టు తేలడంతో ఆయన ప్రస్తుతం అమెరికాలో గొంతు క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు.
 
యోగ్ రాజ్ సింగ్ తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని భార్య సత్వీర్ కౌర్ కి చెప్పలేదు. చివరికి పరీక్షల్లో అది బయటపడింది. అయితే ఆయన యువరాజ్ చికిత్స పొందిన ఆస్పత్రికి పోకుండా వేరే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయన గొంతు నుంచి ఒక కణితిని తీసేశారు. ప్రస్తుతం మాట్లాడకుండా ఉండమని డాక్టర్లు సలహా ఇచ్చారు. 
 
యువరాజ్ యోగరాజ్ మొదటి భార్య షబ్నమ్ కౌర్ ద్వారా జన్మించారు. ఆ తరువాత యోగ్ రాజ్, షబ్నమ్ లు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత యోగరాజ్ సత్వీర్ కౌర్ ను పెళ్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement