breaking news
Shabnam kaur
-
‘తండ్రి కోసం కుర్తా కొనలేని వాడు.. ‘బాబా’ కేమో రూ. 15 లక్షల గిఫ్ట్!’
టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, కోచ్ యోగ్రాజ్ సింగ్ ((Yograj Singh) ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడికి తండ్రి కంటే.. ఓ ‘బాబా’నే ఎక్కువైపోయాడన్నాడు. తన మాజీ భార్య షబ్నమ్ (Shabnam)కు భర్త కంటే ‘బాబా’కు సేవ చేయడం అంటేనే ఎక్కువ ఇష్టం అని పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఏడాది కాలం భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన యోగ్రాజ్ సింగ్ విజయవంతమైన క్రికెటర్ కాలేకపోయాడు.యువీ తల్లితో విడాకులుఅయితే, తన కలను కుమారుడి ద్వారా నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో యువరాజ్ సింగ్ (Yuvraj Singh)ను చిన్ననాటి నుంచే కఠినంగా శ్రమించేలా చేశాడు. ఈ క్రమంలో కుమారుడితో పాటు భార్య షబ్నమ్‌కు కూడా దూరమయ్యాడు. తన పితృస్వామ్య భావజాలం కారణంగా షబ్నమ్తో పెళ్లి పెటాకులై విడాకులకు దారి తీసింది.ఆ తర్వాత నీనా బుంధేల్ అనే నటిని పెళ్లి చేసుకున్న యోగ్రాజ్ సింగ్‌కు ఆమె ద్వారా ఓ కుమార్తె, కుమారుడు కలిగారు. ఇక షబ్నమ్ ద్వారా అతడికి యువరాజ్ సింగ్, జొరావర్ జన్మించారు. అయితే, తన మొండిపట్టుదల కారణంగానే యువీ, అతడి తల్లి షబ్నమ్ తనను విడిచిపెట్టి వెళ్లిపోయారని.. వీలైతే తనను క్షమించాలంటూ ఇటీవల యోగ్రాజ్ వేడుకున్నాడు.నేనొక పాపినిఅయితే, తాజా ఇంటర్వ్యూలో మరోసారి యువీ, షబ్నమ్లను ఉద్దేశించి యోగ్రాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. అన్‌టోల్డ్ పంజాబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేనొక పాపిని. నా జీవితంలో చాలా తప్పులు చేశాను. ఆ దేవుడే నన్ను అన్ని విషయాల్లో శిక్షితుడిని చేశాడని భావించా.నేను దేవుడిని నమ్ముతాను. జేబులో కేవలం ఐదు రూపాయలే ఉన్నపుడు నాకు రూ. 5 లక్షల సినిమా ఆఫర్ వచ్చింది. భాగ్ మిల్కా భాగ్‌లో నన్ను ఓ పాత్ర కోసం సంప్రదించారు.భర్త కంటే బాబానే ఎక్కువనా దృష్టిలో గురు గ్రంథ్ సాహిబ్ కంటే మించినది ఏదీ లేదు. హన్సాలీ వాలే బాబా వంటి నాయకులను నేను నమ్మను. వీరిలో కొందరు నిజంగానే మంచివారై ఉండవచ్చు. కానీ భర్త పాదాలు ఒత్తడాన్ని నామూషీగా భావించేవాళ్లు.. భర్త కోసం వండిపెట్టలేని వారు.. ఇలాంటి బాబాల కోసం మాత్రం భోజనం వండటంతో పాటు సేవలు చేయడానికి సిద్ధమైపోతారు.అందరినీ ఉద్దేశించి అంటున్న మాట ఇది. కేవలం నా ఇంట్లోనే ఇలా జరిగిందని చెప్పను’’ అని పరోక్షంగా షబ్నమ్ గురించి యోగ్రాజ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.తండ్రి కోసం కుర్తా కొనలేని వాడు.. ‘బాబా’ కేమో రూ. 15 లక్షల గిఫ్ట్!అదే విధంగా.. ‘‘తండ్రిగా రక్తం పంచి.. చెమట చిందిస్తూ కష్టనష్టాలకోర్చి పెంచి పెద్ద చేసి.. కన్నీళ్లు దిగమింగుకుంటూ నిన్ను ఉన్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తి కంటే నీకు బాబా ఎక్కువైపోయాడా?కుటుంబాన్ని పోషిస్తూ.. పిల్లల ఎదుగుదల కోసం సర్వస్వం ధారబోసిన వ్యక్తి.. తనకంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని వ్యక్తి.. అలాంటి నీ తండ్రి కోసం కనీసం ఒక్క కుర్తా- పైజామా కొనలేవు. కానీ బాబాకు రూ. 15 లక్షల వాచ్ బహుమతిగా ఇస్తావా?నాకోసం ఇల్లు కొంటానని ఎవరూ ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. వీళ్లేం బంధువులు? వీళ్లేం పిల్లలు’’ అంటూ యువీని ఉద్దేశించి యోగ్రాజ్ సింగ్ ఆరోపణలు చేశాడు. కాగా క్రికెట్ కోచ్‌గా ఉంటూనే..నటుడిగా మారిన యోగ్రాజ్ సింగ్ ఇప్పటికి 200కు పైగా సినిమాల్లో నటించాడు. చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే! -
‘మీ ఇద్దరిని వేదనకు గురిచేశా.. వీలైతే నన్ను క్షమించండి’
టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ మాట మార్చాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh), అతడి తల్లి షబ్నమ్‌ను చేతులు జోడించి మరీ క్షమాపణలు కోరుతున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.కాగా చండీగఢ్‌కు చెందిన యోగ్రాజ్ సింగ్ గతంలో షబ్నమ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి యువరాజ్ సింగ్, జొరావర్ సంతానం. అయితే, పితృస్వామ్య భావజాలం కలిగిన యోగ్రాజ్.. షబ్నమ్‌ను ఇంట్లో పెట్టి తాళం వేసినంత పనిచేశాడు. ఆమె తరఫు బంధువులను కూడా ఇంట్లోకి రానివ్వలేదు.అంతేకాదు.. క్రికెటర్‌గా తీర్చిదిద్దే క్రమంలో యువరాజ్ సింగ్‌ను కూడా ఎంతో కష్టపెట్టాడు. ఒకానొక సమయంలో అతడి శిక్షణ తట్టుకోలేక యువీ చనిపోతాడని తన తల్లి హెచ్చరించినా కరుణించలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యోగ్రాజ్ సింగ్ స్వయంగా ఈ విషయాలు వెల్లడించాడు.మీరే నా పరువు. తల చుట్టూ దుపట్టా ఉండాలిఅంతేకాదు.. తాను ఎవరి విషయంలోనూ పశ్చాత్తాపపడే పనిచేయలేదని కూడా యోగ్రాజ్ (Yograj Singh) వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. మహిళలకు స్వాతంత్ర్యం అవసరం లేదని.. వారికి కుటుంబ బాధ్యతలు అప్పగిస్తే అంతా అస్తవ్యస్తమైపోతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తన రెండో భార్య నీనా, కూతురు అమీకి.. ‘మీరే నా పరువు. తల చుట్టూ దుపట్టా ఉండాలి. లేదంటే నా ప్రాణం పోయినట్లే’ అని హెచ్చరిక చేసినట్లు కూడా వెల్లడించాడు.మీ ఇద్దరిని వేదనకు గురిచేశా.. వీలైతే నన్ను క్షమించండిఅయితే, తాజాగా ఫైవ్వుడ్ పాడ్‌కాస్ట్‌లో యోగ్రాజ్ సింగ్ మాట్లాడుతూ.. తన ప్రవర్తన పట్ల ముఖ్యంగా యువీ, అతడి తల్లి విషయంలో చేసిన తప్పులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ‘‘నా జీవితంలో చేసినవన్నీ తప్పులే. అయితే, నా ఆత్మగౌరవం, కుటుంబ పరువు కోసమే అన్నీ చేశాను.ఈ క్రమంలో జీవితంలోని ఎన్నో జ్ఞాపకాలను తుడిచివేశాను. గురు (దేవుడు) చెప్పిన మాటలే విన్నాను. అయితే, ఇప్పుడు చేతులు జోడించి క్షమాపణలు అడుగుతున్నా.నా వల్ల ఇబ్బందులకు గురైన ప్రతి ఒక్కరినీ క్షమించమని కోరుతున్నా. కుటుంబ సభ్యులైనా, బయటి వ్యక్తులైనా నా వల్ల బాధపడి ఉంటే సారీ. నా పిల్లల్ని క్షమాపన కోరుతున్నా. ముఖ్యంగా నా భార్య.. యువీ తల్లిని.. నన్ను క్షమించాలని వేడుకుంటున్నా.తప్పంతా నాదే. నా సహచర ఆటగాళ్లు, స్నేహితుల విషయంలోనూ నోటికొచ్చినట్లు మాట్లాడాను. క్రికెట్లో, సినిమాల్లో ఎవరినైనా తిట్టి ఉంటే సారీ. మీరంతా నన్ను క్షమించండి.నాలో తప్పులు, అవలక్షణాలు మాత్రమే ఉన్నాయినాలో ఎలాంటి గొప్ప గుణాలు లేవు. కేవలం నాలో తప్పులు, అవలక్షణాలు మాత్రమే ఉన్నాయి. జీవితంలో నేను ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఇకపై కలలో కూడా మరోసారి తప్పులను పునరావృతం చేయను. నేను నిశ్చితంగా నిద్రపోతాను. నాకు ఇప్పుడు మందులు అక్కర్లేదు.నేను చనిపోయినపుడు ఆ గురు నన్ను చూసి గర్విస్తే చాలు’’ అని యోగ్రాజ్ సింగ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇటీవల తాను తీవ్ర అస్వస్థతకు గురయ్యానని.. అప్పుడే అందరి విలువా తెలిసిందని తెలిపాడు. తన మాజీ భార్య షబ్నమ్, ప్రస్తుత భార్య నీనాలను ‘మాతా’గా అభివర్ణించిన యోగ్రాజ్ సింగ్.. తన కుమారుల్లో ‘గురు’ను చూసుకుంటున్నానని ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా యోగ్రాజ్ సింగ్ 1980-81 మధ్యకాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, అతడి కుమారుడు యువరాజ్ సింగ్ భారత క్రికెట్ చరిత్రలో ఉత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా భారత్ టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలవడంలో యువీది కీలక పాత్ర.చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60 ఏళ్లు.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే! -
మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి, కోచ్ యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను మగ అహంకారినని ఇప్పటికే స్పష్టం చేసిన ఈ మాజీ క్రికెటర్.. మహిళల గురించి మరోసారి అనుచిత కామెంట్లతో వార్తల్లోకెక్కాడు. ఇంటి పెత్తనం ఆడవాళ్ల చేతిలో పెడితే.. అంతా అస్తవ్యస్తమైపోతుందని పేర్కొన్నాడు.అందుకే విడాకులుఇటీవల ఎస్ఎమ్టీవీతో మాట్లాడిన యోగ్రాజ్ సింగ్.. యువీ తల్లి షబ్నమ్తో తన విడాకుల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. తాను పితృస్వామ్య భావజాలం కలిగిన వ్యక్తినని.. అందుకే షబ్నమ్ తనతో ఇమడలేకపోయిందని తెలిపాడు. అంతేకాదు.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసినంత పనిచేశానని.. ఈ క్రమంలోనే సఖ్యత చెడి విడాకులు తీసుకున్నామని పేర్కొన్నాడు.అంతేకాదు.. యువీని ఉత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దే క్రమంలో.. అతడిని కఠినంగా శ్రమించేలా చేశానన్న యోగ్రాజ్.. ఒకవేళ యువీ తన పిల్లల్ని గనుక అప్పగిస్తే వారికీ అదే గతి పట్టిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా హైబ్రో స్టూడియోస్‌తో మాట్లాడిన యోగ్రాజ్.. మహిళల స్వాతంత్ర్యం గురించి అవాకులు చెవాకులు పేలాడు.బిడ్డను ఆ దేవుడే రక్షిస్తాడు‘‘మహిళలకు నేను అత్యంత గౌరవం ఇస్తా. అయితే, పురుషులు, మహిళకలకంటూ వేర్వేరు బాధ్యతలు ఉంటాయి. తల్లి గర్భంలో ఉన్నపుడు బిడ్డను ఆ దేవుడే రక్షిస్తాడు. తన లోపల ఏం జరుగుతుందో ఆ మహిళకు ఏం తెలుస్తుంది.దేవుడే ఆమెనూ కాపాడతాడు. బిడ్డ భూమ్మీదకు రాగనే ఏడుస్తాడు. ఎందుకంటే.. అప్పుడే ఆ దేవుడు బిడ్డ వేలిని విడిచిపెడతాడు. ప్రేమైక భాషలో చెప్పాలంటే.. దేవుడు ఆ బిడ్డను తండ్రి చేతుల్లో పెడతాడు. నీ బిడ్డ రాతను నువ్వే రాయమని చెప్తాడు. తల్లికీ కొన్ని బాధ్యతలు ఇస్తాడు.అలా చేయనివాడు తండ్రే కాడుఏడుస్తున్న బిడ్డను తల్లి హత్తుగానే.. బిడ్డ ఏడుపు ఆపేస్తుంది. మాతృమూర్తికి ఉన్న శక్తి అది. ఆ తర్వాత మాత్రం అంతా తండ్రే చూసుకుంటాడు. బిడ్డ రాతను రాసి.. అతడు లేదంటే ఆమెను ప్రయోజకురాలిని చేస్తాడు. అలా చేయనివాడు తండ్రే కాడు.మా అమ్మకి 19.. నాన్నకు 60ఇక తల్లి ఇంటి పనులు చుసుకుంటుంది. ఇంటి యజమాని తండ్రి. ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుంది. ఈ సూత్రాన్ని అనుసరిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. మా అమ్మ మా నాన్న కంటే వయసులో 42 ఏళ్లు చిన్నది. అమ్మకు 19 ఏళ్లు ఉన్నపుడు 60 ఏళ్ల వయసులో ఉన్న మా నాన్నతో పెళ్లి చేశారు.అయినా సరే వారి మధ్య ప్రేమకు కొదవలేదు. అసలు అలాంటి ప్రేమను నేను ఎక్కడా చూడలేదు. ఒకరి కోసం ఒకరు బతికారు. ఒకరంటే ఒకరు పడిచచ్చిపోయేవారు. అయితే, మా అమ్మ ఒక స్త్రీగా తన పని చేయడం.. నా తండ్రి పురుషుడిగా బాధ్యతలు నిర్వర్తించడం వల్లే ఇది సాధ్యమైంది.తల చుట్టూ దుపట్టా ధరించాల్సిందేఇక నా కుటుంబంలోనే నేనే యజమానిని. కిట్టీ పార్టీలు ఉండకూడదు. మహిళ కచ్చితంగా తన తల చుట్టూ దుపట్టా ధరించాల్సిందే. పెద్దలు పెట్టిన ప్రతీ నిబంధనను వారు పాటించాలి. చాలా మంది నన్ను తప్పుగా అనుకోవచ్చు.నా పరువు మీరేఏదేమైనా మా ఇంట్లో ఒక్కరూ నా మాట జవదాటరు. నా భార్య, కూతురితో ఒకే మాట చెప్పాను. ‘నా పరువు మీరే’ దానిని ఎప్పటికీ దిగజార్చవద్దు అని హెచ్చరిక చేశాను. ఒకవేళ అదే జరిగతే నా ప్రాణమే పోతుందని చెప్పా. ఇందులో తప్పేమైనా ఉందా?’’ అంటూ యోగ్రాజ్ సింగ్ మరోసారి నిస్సిగ్గుగా తన పితృస్వామ్య భావజాలాన్ని బయటపెట్టడమే కాక.. దానిని సమర్థించుకున్నాడు కూడా! రెండో పెళ్లికాగా యువీ తల్లితో విడాకుల తర్వాత యోగ్రాజ్ సింగ్ నీనా బుంధేల్ అనే పంజాబీ నటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. ఇక షబ్నమ్తో యోగ్‌రాజ్‌కు కుమారులు యువరాజ్, జొరావర్ కలిగారు.ఇక టీమిండియా తరఫున 1980- 81 మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన చంఢీగడ్ యోగ్రాజ్ సింగ్.. ఒక టెస్టులో 10 పరుగులు, ఆరు వన్డేల్లో కలిపి ఒక పరుగు చేశాడు. టెస్టుల్లో ఒక వికెట్, వన్డేల్లో నాలుగు వికెట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.చదవండి: వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. రిలేషన్షిప్లో ఉన్నా! -
భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని.. ఎవరూ రావొద్దని వార్నింగ్!
టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ (Yograj Singh)తన విడాకులకు గల కారణాన్ని వెల్లడించాడు. తాను పెట్టిన కఠినమైన నిబంధనల వల్లే.. షబ్నమ్ (Shabnam)తో తన పెళ్లి పెటాకులైందంటూ కుండబద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు ఆడిన యోగ్రాజ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.యువీ భవిష్యత్తు కోసమేభారత్కు తొలి వరల్డ్‌కప్ అందించిన కపిల్ దేవ్ (Kapil Dev) వల్లే తన కెరీర్ నాశనమైందని భావించిన యోగ్రాజ్.. తన కుమారుడి రూపంలో టీమిండియాకు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ను అందించాలని భావించాడు. ఇందుకోసం క్రమశిక్షణ పేరిట తన కొడుకు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించానని యెగ్రాజ్ ఇటీవలే వెల్లడించాడు.ఒకానొక దశలో తన తల్లి యువీ మానసిక స్థితి గురించి చాలా భయపడిపోయిందని.. మనుమడి పట్ల దయ చూపాలని కోరిందని యోగ్రాజ్ తెలిపాడు. అయినా తన మనసు కరగలేదని.. యువీ భవిష్యత్తు కోసమే కఠినంగా ఉన్నానంటూ తనను తాను సమర్థించుకున్నాడు. తాజాగా ఎస్ఎమ్టీవీకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో యువీ తల్లి షబ్నమ్తో తన విడాకులకు గల కారణం గురించి వెల్లడించాడు.ఒక రకంగా ఇంట్లో పెట్టి తాళం వేసినట్లు చేశా‘‘విదేశీయుల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో నేను చదువుకున్నా. మా నాన్న క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. నేను అదే మిగిలిన వాళ్లపై ప్రయోగించాను. నా భార్య షబ్నమ్తోనే ఇది మొదలుపెట్టాను.నా అనుమతి లేకుండా బయటకు వెళ్లవద్దని ఆదేశించా. ఒక రకంగా ఇంట్లో పెట్టి తాళం వేసినట్లు చేశా. ఇక తన కుటుంబ సభ్యులు ఎవరూ మా ఇంటికి రావొద్దని హెచ్చరించా. ఒకవేళ ఎవరైనా దారి తప్పి వచ్చినా వాళ్లు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వద్దని కచ్చితంగా చెప్పేశా.వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పామాకు కుమారుడు జన్మించిన తర్వాత.. నాలో దాగి ఉన్న కసినంతా బయటకు తీసి.. నా కొడుకుని లెజెండ్‌గా తీర్చిదిద్దుతా అని మా అమ్మకు చెప్పాను. నన్ను తప్పుగా చూపించే ప్రయత్నం చేసిన కపిల్ దేవ్ వంటి వాళ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు నా కుమారుడిని అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించుకున్నా.అందుకే కష్టపెట్టైనా సరే వాడిని అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ని చేశా. ఏదేమైనా పితృస్వామ్య భావజాలం గల నాతో షబ్నమ్ ఇమడలేకపోయింది. యువీ, తన తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్లిన రోజు.. నా జీవితంలో తొలిసారిగా ఏడ్చాను.నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతా. నాకు నటన రాదు. అందుకే నా పరిస్థితి ఇలా అయింది. మా వాళ్లు నన్ను ఓ పిచ్చోడు అనుకున్నారు’’ అని యోగ్రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశాఇక గతంలో ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా. నేనొక రైతుని. ఆమె వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది. నాకున్న మగ అహంకారంతో ఆమెను పంజరంలో బంధించినట్లు చేశా.అది ఆమెకు నచ్చలేదు. అయినా సర్దుకుపోయేది. కానీ ఒకానొక దశలో మా ఇద్దరికీ అస్సలు పడలేదు.అందుకే విడిపోవాల్సి వచ్చింది’’ అని యెగ్రాజ్ సింగ్ తెలిపాడు. కాగా షబ్నమ్- యోగ్రాజ్లకు యువరాజ్ సింగ్‌తో పాటు జొరావర్ సంతానం. విడాకుల తర్వాత యోగ్రాజ్ నీనా బుంధేల్ అనే నటిని పెళ్లి చేసుకోగా.. వీరికి కుమారుడు, కుమార్తె జన్మించారు. చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’ -
యువరాజ్ తండ్రికి కూడా క్యాన్సర్
కష్టాలు సిక్సర్ ధీరుడు యువరాజ్ ను వదలడం లేదు. ప్రాణాంతక క్యాన్సర్ ను జయించిన యువరాజ్ సింగ్ కి ఇప్పుడు మరో షాక్ ఎదురైంది. ఆయన తండ్రి, మాజీ టెస్ట్ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ కి క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. ఆయన గొంతు క్యాన్సర్ ఉన్నట్టు తేలడంతో ఆయన ప్రస్తుతం అమెరికాలో గొంతు క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. యోగ్ రాజ్ సింగ్ తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని భార్య సత్వీర్ కౌర్ కి చెప్పలేదు. చివరికి పరీక్షల్లో అది బయటపడింది. అయితే ఆయన యువరాజ్ చికిత్స పొందిన ఆస్పత్రికి పోకుండా వేరే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయన గొంతు నుంచి ఒక కణితిని తీసేశారు. ప్రస్తుతం మాట్లాడకుండా ఉండమని డాక్టర్లు సలహా ఇచ్చారు. యువరాజ్ యోగరాజ్ మొదటి భార్య షబ్నమ్ కౌర్ ద్వారా జన్మించారు. ఆ తరువాత యోగ్ రాజ్, షబ్నమ్ లు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత యోగరాజ్ సత్వీర్ కౌర్ ను పెళ్లాడారు.


