ఫైనల్లో పరాజితులు లేరు 

World Cup Final Match In Game Terms Are Not Fair Said By Williamson - Sakshi

నిబంధనలపై లోతైన అవగాహన లేదు

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌

వెల్లింగ్టన్‌: ప్రపంచ కప్‌ ఫైనల్లో ఫలితాన్ని తేల్చిన తీరుపై న్యూజిలాండ్‌ వైపు నుంచి స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి. జట్టు కెప్టెన్‌ విలియమ్సన్‌ సహా కోచ్, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఆరు పరుగుల (2+4) ఓవర్‌ త్రోపై  విలియమ్సన్‌ తమ దేశ మీడియాతో మాట్లాడుతూ... మ్యాచ్‌ ఆఖరి క్షణాల్లో అంపైర్లు చేసిన ఈ క్లిష్టమైన పొరపాటును తెలుసుకుని తామంతా ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు. ‘నిబంధనలపై సంపూర్తి అవగాహన లేని మేం ఆ సమయంలో అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించాం. వందలకొద్దీ ఉన్న ఇతర నిబంధనల్లానే ఇదీ ఒకటని భావించాం తప్ప భిన్నమైనదని అనుకోలేదు’ అని అతడు తెలిపాడు.

తీవ్ర ఉత్కంఠగా సాగిన తుది సమరంలో పరాజితులు ఎవరూ లేరని విలియమ్సన్‌ వివరించాడు. ఫలితాన్ని చూస్తే ఒక్క కిరీటం (ప్రపంచ కప్‌ ట్రోపీ) దక్కడం తప్ప రెండు జట్ల మధ్య తేడా ఏదీ లేదని అతడు విశ్లేషించాడు. కోచ్‌ గ్యారీ స్టీడ్‌ స్పందిస్తూ... ప్రపంచ కప్‌ నిబంధనలను తప్పనిసరిగా సమీక్షించాలని కోరాడు. ఆటలో సమఉజ్జీలుగా నిలిచినప్పటికీ సాంకేతిక అంశాలతో ఓటమి పాలవడం బాధాకరంగా ఉందని అతడు అన్నాడు. ఎన్నో అంశాలు ఉండగా... ప్రపంచ కప్‌ ఫైనల్‌ లాంటి మ్యాచ్‌లో ఇలాంటి నిబంధనలు వర్తింప చేయాల్సి వస్తుందని వాటిని రూపొందించినవారు సైతం ఊహించి ఉండరని స్టీడ్‌ పేర్కొన్నాడు. ‘ఆరు పరుగుల ఓవర్‌ త్రో’ నిర్ణయంపై స్పందిస్తూ అంపైర్లూ మనుషులేనని వారూ పొరపాట్లు చేస్తారని, అయినా వారు మ్యాచ్‌ అధికారులు కాబట్టి వాటిని అంగీకరించాల్సిందేనని అన్నాడు.

భారత్‌లో జరిగే 2023 ప్రపంచ కప్‌నకు తమ జట్టు మరింత దృఢంగా తయారవుతుందని, టైటిల్‌కు గట్టి పోటీదారుగా నిలుస్తుందని కివీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ డానియెల్‌ వెటోరి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫైనల్‌ ఓటమిని అతడు తేలిగ్గా తీసుకున్నాడు. మరోవైపు ఆటగాళ్లు విడివిడిగా స్వదేశం చేరుకుంటుండటంతో న్యూజిలాండ్‌ జట్టుకు స్వదేశంలో స్వాగత కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. అయితే, వారి అద్వితీయ ప్రదర్శనకు తగిన రీతిలో స్వాగతం పలకాలని బోర్డు భావిస్తోంది. దీనికోసం దేశ ప్రధాని జెసిండా అర్డెమ్, క్రీడా మంత్రి గ్రాంట్‌ రాబర్ట్‌సన్‌తో సంప్రదింపులు జరుపుతోంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

17-07-2019
Jul 17, 2019, 07:57 IST
లండన్‌ : సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్‌ విజయ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి తమ దేశానికి...
16-07-2019
Jul 16, 2019, 15:42 IST
లండన్‌: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో ఓవర్‌ త్రో అయిన బంతికి ఇంగ్లండ్‌కు ఆరు పరగులు కాకుండా ఐదు...
16-07-2019
Jul 16, 2019, 14:28 IST
ఓవర్‌ త్రో వివాదంపై మాట్లాడటానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)
16-07-2019
Jul 16, 2019, 14:07 IST
న్యూఢిల్లీ: క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ.  వరల్డ్‌కప్‌కు ముందు పలువురు దిగ్గజ...
16-07-2019
Jul 16, 2019, 13:20 IST
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీలో అందులోనూ విజేతను ప్రకటించే క్రమంలో ‘బౌండరీ రూల్‌’ ను పాటించడంపై బాలీవుడ్‌ మెగాస్టార్‌...
16-07-2019
Jul 16, 2019, 11:35 IST
లండన్‌: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠం...
16-07-2019
Jul 16, 2019, 10:51 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ కప్‌ అంచుల వరకూ వెళ్లి చతికిలబడటం వెనుక ఆ జట్టు ఆటగాళ్ల తప్పిదాలు...
16-07-2019
Jul 16, 2019, 10:03 IST
న్యూఢిల్లీ: ఇప్పటివరకైతే మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై స్పష్టత లేదు కానీ... వచ్చే నెలలో వెస్టిండీస్‌ లో పర్యటించే భారత...
16-07-2019
Jul 16, 2019, 05:05 IST
లండన్‌: ప్రపంచ కప్‌ విజేతగా నిలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది....
16-07-2019
Jul 16, 2019, 04:58 IST
లండన్‌: బెన్‌ స్టోక్స్‌ అంటే అందరికీ రెండే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. 2016 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చివరి ఓవర్లో...
16-07-2019
Jul 16, 2019, 04:52 IST
లండన్‌: ప్రపంచ కప్‌ను గెలుచుకున్నామన్న ఆనందం నుంచి తాము ఇంకా బయటకు రాలేకపోతున్నట్లు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ చెప్పాడు....
15-07-2019
Jul 15, 2019, 20:41 IST
న్యూఢిల్లీ : క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయిన ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి స్పందించాడు. ఒక...
15-07-2019
Jul 15, 2019, 20:05 IST
లిమిటెడ్‌ ఓవర్స్‌ ఫార్మాట్‌ సారథ్య బాధ్యతలను రోహిత్‌శర్మకు అప్పగించే యోచనలో బీసీసీఐ
15-07-2019
Jul 15, 2019, 18:49 IST
ఈ మెగా జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ను ఎంపిక చేయగా
15-07-2019
Jul 15, 2019, 17:56 IST
బౌండరీలకన్నా సింగిల్స్‌ తీస్తూ పరుగులు చేయడమే అసలైన క్రికెట్‌ అని
15-07-2019
Jul 15, 2019, 17:13 IST
భారత్‌తో జరిగిన సెమీస్‌ పోరులో కివీస్‌ చేసిన తప్పుకు ఫలితమే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓటమని
15-07-2019
Jul 15, 2019, 16:49 IST
ఓ తండ్రిగా గర్వపడుతున్నప్పటికీ.. న్యూజిలాండ్‌ ఓటమి తనను తీవ్రంగా నిరాశపరించిందని వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఫైనల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’...
15-07-2019
Jul 15, 2019, 15:56 IST
లండన్‌: నాటకీయ పరిణామాల మధ్య ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ గెలవడం ఒకటైతే, ఆ దేశ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఎప్పుడో ఆరేళ్ల...
15-07-2019
Jul 15, 2019, 15:44 IST
బెన్‌స్టోక్స్‌, ఆదిల్‌ రషీద్‌లు రెండో పరుగు పూర్తి చేయకుండానే..
15-07-2019
Jul 15, 2019, 14:35 IST
లండన్‌: జోఫ్రా ఆర్చర్‌.. వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్‌ ముందుగా ప్రకటించిన జాబితాలో ఈ పేరు లేదు. ఇంగ్లండ్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ డేవిడ్‌...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top