విండీస్‌ గెలుపు దారిపట్టేనా?

World Cup 2019 West Indies opt to bowl First Against New Zealand - Sakshi

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతన్న ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ పేలవ ప్రదర్శనతో నిరుత్సాహపరుస్తుండగా.. మరో వైపు న్యూజిలాండ్‌ వరుస విజయాలతో దూసుకపోతోంది. శనివారం ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా ఈ రెండు జట్లు(విండీస్‌, కివీస్‌) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కరేబియన్‌ జట్టు తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్‌ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా.. విండీస్‌ మూడు మార్పులు చేసింది. గాయం కారణంగా విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో బ్రాత్‌వైట్‌ను తుదిజట్టులోకి తీసుకుంది. అంతేకాకుండా గత మ్యాచ్‌లో విపలమైన డారెన్‌ బ్రేవో, గాబ్రియల్‌లను పక్కకు పెట్టి వారి స్థానాలలో నర్స్‌,  కీమర్‌ రోచ్‌లకు అవకాశం కల్పించింది.

గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో అవమానకర రీతిలో ఓడిన విండీస్‌ నేటి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇక విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఈరోజు అద్భుతాలు చేస్తే తప్ప కివీస్‌ జోరును అడ్డుకోవడం అసాధ్యం. మరోవైపు వరుస విజయాలతో సెమీస్‌ బెర్త్‌ను ఇప్పటికే దాదాపు ఖాయం చేసుకున్న కివీస్‌ మరో విజయంతో దానిని మరింతగా పటిష్టం చేసుకోవాలనుకొంటుంది.  బ్యాటింగ్‌, బౌలింగ్‌ అన్ని విభాగాల్లో విండీస్‌ కంటే కివీస్‌ మెరుగ్గా ఉంది. ప్రపంచకప్‌లో విండీస్‌, న్యూజిలాండ్‌లు 7 సార్లు తలపడగా.. న్యూజిలాండ్‌ 4 సార్లు, విండీస్‌ 3 సార్లు గెలిచాయి.

తుదిజట్లు:
వెస్టిండీస్‌: జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, హోప్‌, లూయిస్‌, నికోలస్‌ పూరన్‌, హెట్‌మేర్‌, బ్రాత్‌వైట్‌, నర్స్‌, థామస్‌, కీమర్‌ రోచ్‌, కాట్రెల్‌
న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), మార్టిన్‌ గప్టిల్‌, కోలిన్‌ మున్రో, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌, సాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ, ఫెర్గుసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top