భారత్‌లో ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ | World boxing championship in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

Jul 26 2017 12:01 AM | Updated on Sep 5 2017 4:51 PM

తొలి ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది.

న్యూఢిల్లీ: తొలి ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. 2021లో ఈ మెగా బాక్సింగ్‌ ఈవెంట్‌ జరగనుంది. మాస్కోలో జరిగిన  ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్‌ అసోసియేషన్‌ (ఐబా)ఆతిథ్య వేదికల్ని ఖరారు చేసింది.

2019 టోర్నీకి సోచి, 2021 ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యమిస్తాయని ఐబా అధ్యక్షుడు చింగ్‌ కూ వు తెలిపారు. ఇప్పటికే వచ్చే ఏడాది మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ భారత్‌లో ఖరారైంది. 1990లో ప్రపంచకప్‌ ముంబైలో, 2010లో కామన్వెల్త్‌ గేమ్స్‌ న్యూఢిల్లీలో జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement