బిటిష్‌ గ్రాండ్‌ప్రి జరిగేనా!

Without Quarantine Not Possible For Grand Prix Race Says British Government - Sakshi

లండన్‌: జూలైలో వరుసగా రెండు వారాల్లో రెండు రేసులను నిర్వహించాలని ఆశించిన బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ (ఎఫ్‌1) నిర్వాహకులకు నిరాశ ఎదురైంది. ఎఫ్‌1 రేసుల్లో పాల్గొనేందుకు వచ్చే అన్ని జట్లకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని రేసు నిర్వాహకులు బ్రిటన్‌ ప్రభుత్వాన్ని కోరారు. అయితే దీనికి బ్రిటన్‌ ప్రభుత్వం అంగీకరించలేదు. జూన్‌ 8 నుంచి బ్రిటన్‌లో అడుగుపెట్టే వారు తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని... ఈ నిబంధనలు ఎవరికీ మినహాయింపు కాదని బ్రిటన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు వారాల తర్వాతే ఈ నిబంధనపై సమీక్షిస్తారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top