ఆసీస్ నిలుస్తుందా? | will australia stand in champions trophy race | Sakshi
Sakshi News home page

ఆసీస్ నిలుస్తుందా?

Jun 10 2017 2:55 PM | Updated on Sep 5 2017 1:17 PM

ఆసీస్ నిలుస్తుందా?

ఆసీస్ నిలుస్తుందా?

చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు రద్దు కావడంతో ఆ జట్టు చావోరేవో సవాల్ కు సిద్ధమైంది.

బర్మింగ్ హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు రద్దు  కావడంతో ఆ జట్టు చావోరేవో సవాల్ కు  సిద్ధమైంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో జరిగిన మ్యాచ్లు రద్దు కావడంతో ఆసీస్ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ తరుణంలో గ్రూప్-ఎలో ఇంగ్లండ్ తో శనివారం జరిగే వన్డే మ్యాచ్ ఆసీస్ కు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే నేరుగా నాకౌట్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓటమి  ఎదురైతే గ్రూప్ స్టేజ్ లోనే ఆసీస్ ఇంటి దారి పట్టక తప్పదు.


మరొకవైపు వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్ కు చేరిన ఇంగ్లండ్ ను ఓడించడం ఆసీస్ కు కష్టంగానే కనిపిస్తోంది. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ మంచి జోరుమీద ఉంది. దాంతో పటిష్టమైన ఇంగ్లండ్ పై విజయం సాధించాలంటే ఆసీస్ పూర్తిస్థాయి ప్రదర్శన చేయాలి.  ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్ ఇంగ్లండ్ కు నామమాత్రపు మ్యాచ్ కావడం  ఆ జట్టు మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, హెన్రిక్యూస్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్ వెల్, మాథ్యూ వేడ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా,హజల్ వుడ్

ఇంగ్లండ్ తుది జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్),జాసన్ రాయ్, హేల్స్, జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ,  రషిద్, ప్లంకెట్, మార్క్  వుడ్, జాక్ బాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement