మాథ్యూ వేడ్పై వేటు | Wicketkeeper Matthew Wade not wanted by Australia at World T20 | Sakshi
Sakshi News home page

మాథ్యూ వేడ్పై వేటు

Feb 9 2016 6:54 PM | Updated on Sep 3 2017 5:17 PM

మాథ్యూ వేడ్పై వేటు

మాథ్యూ వేడ్పై వేటు

త్వరలో భారత్ లో జరుగనున్న వరల్డ్ టీ 20లో భాగంగా మంగళవారం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ పై వేటు పడింది.

సిడ్నీ:త్వరలో భారత్ లో జరుగనున్న వరల్డ్ టీ 20లో భాగంగా మంగళవారం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ పై వేటు పడింది. గత ఏడాది వరల్డ్ కప్ అనంతరం వికెట్ కీపర్ గా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోకి వచ్చిన మాథ్యూవేడ్ను తొలగిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. బ్రాడ్ హాడిన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో వేడ్ జట్టులోకి వచ్చాడు. అయితే అటు కీపింగ్ లోనూ, బ్యాటింగ్లోనూ ఆకట్టుకోని వేడ్ కు ఆసీస్ సెలక్టర్లు ఉద్వాసన పలికారు. అతని స్థానంలో కీపర్ పీటర్ నేవిల్ను 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్థానం కల్పించారు. ఇదిలాఉండగా, ఆరోన్ ఫించ్ ను  టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పించారు. అతని స్థానంలో వన్డే, టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్నే టీ 20 సారథిగా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement