క్రిస్ గేల్ ఆడకపోయినా.. | West Indies not weakened by Chris Gayle's absence, says Sarfraz | Sakshi
Sakshi News home page

క్రిస్ గేల్ ఆడకపోయినా..

Sep 23 2016 12:10 PM | Updated on Sep 4 2017 2:40 PM

క్రిస్ గేల్ ఆడకపోయినా..

క్రిస్ గేల్ ఆడకపోయినా..

ప్రస్తుత వెస్టిండీస్ టీ 20 జట్టులో క్రిస్ గేల్ ఆడకపోయినంత మాత్రాన ఆ జట్టును తక్కువ అంచనావేయొద్దని పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ ఖాన్ హెచ్చరించాడు.

యూఏఈ: ప్రస్తుత వెస్టిండీస్ టీ 20 జట్టులో క్రిస్ గేల్ ఆడకపోయినంత మాత్రాన ఆ జట్టును తక్కువ అంచనావేయొద్దని పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ హెచ్చరించాడు. వెస్టిండీస్ కు గేల్ ప్రధాన ఆటగాడే, కానీ మారిన పరిస్థితుల్లో విండీస్ చాలా బలంగా ఉందన్న సంగతిని పాక్ ఆటగాళ్లు గుర్తించాల్సిన అవసరం ఉందన్నాడు. రేపట్నుంచి(శనివారం) ఇరు జట్ల మధ్య రెండు టీ 20 సిరీస్ యూఏఈలో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుకు ముందుగా హెచ్చరికలు జారీ చేశాడు.

 

' విండీస్ జట్టులో గేల్ లేకపోవడం మాకు ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుందని అనుకోవడం లేదు. ఇది టీ 20 క్రికెట్. దాంతోపాటు విండీస్ అత్యంత ప్రమాదకరమైన జట్టు. కేవలం మనం ఎంతవరకు బాగా ఆడాలి అనే దానిపైనే దృష్టి పెడదాం.  ఇటీవల మాంచెస్టర్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ అద్భుతంగా ఆడింది. అదే ఫామ్ ను పాక్ కొనసాగిస్తుందని ఆశిస్తున్నా' అని సర్ఫరాజ్ తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement