తొలి రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్.. జింబాబ్వేపై నిలకడగా ఆడుతున్నాడు.
కాన్బెర్రా: తొలి రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్.. జింబాబ్వేపై నిలకడగా ఆడుతున్నాడు. గేల్ మూడు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. గేల్తో పాటు శామ్యూల్స్ (17) బ్యాటింగ్ చేస్తున్నాడు.
ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లో వెస్టిండీస్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. వెస్టిండీస్ పరుగుల ఖాతా తెరవకనే తొలి వికెట్ కోల్పోయింది. విండీస్ ఓపెనర్ డ్వెన్ స్మిత్.. ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డయ్యాడు.