ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మృతి | West Bengal Top Badminton Player Dies | Sakshi
Sakshi News home page

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మృతి

Nov 27 2018 8:37 AM | Updated on Nov 27 2018 8:38 AM

West Bengal Top Badminton Player Dies - Sakshi

డబుల్స్‌ నంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మృతి

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు త్రినాంకుర్‌ నాగ్‌(26) విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. రైల్వే ఉద్యోగి అయిన త్రినాంకుర్‌ రైల్వే కార్‌ షెడ్‌లో పని చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు... కోల్‌కతాకు చెందిన త్రినాంకుర్‌కు చిన్న నాటి నుంచే బ్యాడ్మింటన్‌ పట్ల ఆసక్తి కనబరిచేవాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పలు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం ఇతడు రాష్ట్ర డబుల్స్‌ నంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

కాగా స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగం పొందిన త్రినాంకుర్ ప్రస్తుతం ఈస్ట్రన్‌ రైల్వేస్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రైల్వే కార్‌ షెడ్‌లో విధులు నిర్వర్తిసున్న సమయంలో హై టెన్షన్‌ కరెంటు తీగ తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని బీ ఆర్‌ సింగ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గొప్ప ఆటగాడిని కోల్పోయాం
‘తన ప్రతిభతో రాష్ట్రానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టిన నాగ్‌ ఇక లేడన్న విషయం చాలా బాధకరంగా ఉంది. అతడి మరణం బెంగాల్‌ బ్యాడ్మింటన్‌కు, రాష్ట్రానికి తీరని లోటు. గొప్ప క్రీడాకరుడిని కోల్పోయాం’  అని పశ్చిమ బెంగాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధికారి బిశ్వాస్‌ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement