టాప్ సీడ్ స్టానిస్లాస్ వావ్ రింకా చెన్నై ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు.
చెన్నై: టాప్ సీడ్ స్టానిస్లాస్ వావ్ రింకా చెన్నై ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వావ్ రింకా 7-5, 6-2 తేడాతో రోజర్ వాస్లిన్ పై విజయం సాధించించాడు. ఏకపక్షం జరిగిన పోరులో వావ్ రింకా కేవలం 35 నిమిషాల్లోనే ట్రోఫీని చేజిక్కించుకుని సత్తా చాటాడు. ఎనిమిదో సీడ్ వావ్ రింకా టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. చెన్నై ఓపెన్ లో ఎప్పుడూ ఆకట్టుకుని వావ్ రింకా రెండో సారి ట్రోఫిని సాధించాడు. కాగా, రోజర్ వాస్లిన్ చేతి వరకు వచ్చిన అవకాశం చేజారింది. తొలిసారి ఏటీపీ ట్రోఫీని కైవసం చేసుకుందామని భావించిన వాస్లిన్ నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.