'టీమిండియా ఫుల్ టైమ్ కోచ్ గా చేయలేను' | wasim Akram, Vengsarkar bat for home-grown coach for Indian team | Sakshi
Sakshi News home page

'టీమిండియా ఫుల్ టైమ్ కోచ్ గా చేయలేను'

May 5 2015 7:39 PM | Updated on Sep 3 2017 1:29 AM

'టీమిండియా ఫుల్ టైమ్ కోచ్ గా చేయలేను'

'టీమిండియా ఫుల్ టైమ్ కోచ్ గా చేయలేను'

టీమిండియా ఫుల్ టైమ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టడానికి పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ అనాసక్తి కనబరిచాడు.

కోల్ కతా: టీమిండియా ఫుల్ టైమ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టడానికి పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ అనాసక్తి కనబరిచాడు. ఈ మేరకు టీమిండియా మాజీ ఆటగాడు దిలీప్ వెంగసర్కార్ సూచనను అక్రమ్ మర్యాద పూర్వంగా తిరస్కరించాడు.  ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్ గా పని చేస్తున్న అక్రమ్ .. టీమిండియా కోచ్ అంశంపై స్పందించాడు. 'నేను టీమిండియాకు ఫుల్ టైమ్ కోచ్ గా అందుబాటులో ఉండలేను. నాకున్న వాణిజ్యపరమైన, కుటుంబపరమైన లావాదేవీలతో ఫుల్ టైమ్ కోచ్ గా ఉండటం కష్టం'అని స్పష్టం చేశాడు.

 

టీమిండియా కోచ్ వేటలో భాగంగా ఉపఖండంలోని కోచ్ లు అయితే బాగుంటుందని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. దీనిలో భాగంగానే అక్రమ్ పేరును వెంగసర్కార్ తెరపైకి తీసుకొచ్చాడు. అంతకుమందు భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా పని చేసిన డంకెన్ ఫ్లెచర్ పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఫ్లెచర్ కోచ్ గా కొనసాగించే అవకాశం లేనందును ఉప ఖండపు కోచ్ లను నియమిస్తే బావుంటుందనేది బీసీసీఐ ఆలోచన. అయితే విదేశీ కోచ్ లను(ఉప ఖండపు కోచ్ లు మినహా) టీమిండియా కోచ్ లుగా నియమించినా .. వారు ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడటం కష్టంగా ఉందని వెంగీ తెలిపాడు. దీనిలో భాగంగా అక్రమ్ పేరును ప్రస్తావనకు తీసుకు వచ్చినట్లు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement