వసీం అక్రమ్ దూరం | Wasim Akram to Miss IPL 2017 | Sakshi
Sakshi News home page

వసీం అక్రమ్ దూరం

Dec 10 2016 1:18 PM | Updated on Sep 4 2017 10:23 PM

వసీం అక్రమ్ దూరం

వసీం అక్రమ్ దూరం

కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవరిస్తున్న పాక్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్.. వచ్చే ఏడాది జరిగే 10వ ఎడిషన్కు దూరం కానున్నాడు.

కోల్కతా: గత కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవరిస్తున్న పాక్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్.. వచ్చే ఏడాది జరిగే 10వ ఎడిషన్కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్  తాజాగా ప్రకటించింది. వచ్చే సంవత్సరం ఐపీఎల్లో వసీం అక్రమ్ సేవలు తమకు ఉండటం లేదని తెలిపింది.  కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వసీం తమ జట్టు డ్రెస్సింగ్ రూమ్కు దూరం కావాల్సివస్తుందని కేకేఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకీ మైసూర్ తెలిపారు.

 

'మా కేకేఆర్ కుటుంబంలో ఒకడిగా మారిపోయిన వసీం సేవలను వచ్చే సీజన్లో మేము కోల్పోతున్నాం. 2012, 14ల్లో మేము టైటిల్ గెలవడంలో వసీం పాత్ర వెలకట్టలేనిది. అతన్ని మిస్సవుతున్నాం. ఏది ఏమైనా అతనికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం'అని వెంకీ మైసూర్ అన్నారు.

ఇదిలా ఉంచితే చాలా ఏళ్ల నుంచి కేకేఆర్తో మంచి సంబంధం ఉంది. నా పాత్రను చాలా ఎంజాయ్ చేశా. వచ్చే ఏడాది మా డ్రెస్సింగ్ రూమ్కు నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. జట్టు విజయ పథంలో దూసుకెళ్లాలి'అని వసీం పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement