నాకు నలభై ఏళ్లేనట! | Wasim Akram Says Life 'Exemplary' At Age Of 50 | Sakshi
Sakshi News home page

నాకు నలభై ఏళ్లేనట!

Jun 4 2016 3:39 PM | Updated on Sep 4 2017 1:40 AM

నాకు నలభై ఏళ్లేనట!

నాకు నలభై ఏళ్లేనట!

పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ తన యాభైవ పుట్టినరోజు వేడుకల్ని భార్యతో కలిసి జరుపుకున్నాడు.

కరాచీ:పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ తన యాభైవ పుట్టినరోజు వేడుకల్ని భార్యతో కలిసి జరుపుకున్నాడు. సాధారణ కుర్రాడి స్థాయి నుంచి అంతర్జాతీయంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న తన జీవితం ఇప్పటివరకూ ఆదర్శప్రాయంగానే సాగిందని ఈ సందర్భంగా వసీం తెలిపాడు. ఈ యాభై ఏళ్ల తన జీవితం కచ్చితంగా అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అయితే 'నీవు కొత్తగా 40 ఒడిలో అడుగుపెట్టినట్లు ఉన్నావంటూ'   భార్య  షనీరా థాంప్సన్‌ అభినందనతో  తాను ఎక్కువ ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నాడు.ఈ పుట్టిన రోజు వేడుకలు నా జీవితంలో మరింత కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. నా జీవితం ఇప్పటివరకూ ఆదర్శవంతంగానే నిలిచింది. నాకు  40 ఏళ్లే నంటూ భార్య ఇచ్చిన అభినందనతో ఎక్కువ ఎంజాయ్ చేశా' అని అక్రమ్ తెలిపాడు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్థి జట్లను గడగడలాడించిన అక్రమ్కు చాలానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు పాకిస్తాన్తో పాటు భారత్లోనూ అక్రమ్కు విశేష సంఖ్యలో అభిమానులున్నారు. వసీం అక్రమ్ 104 టెస్టులాడి 414 వికెట్లు తీయగా, 356 వన్డేల్లో 502 వికెట్లు సాధించాడు. అతను సాధించిన ఈ రెండు ఘనతలు పాకిస్తాన్ క్రికెట్లో ఇప్పటికీ పదిలంగా ఉండటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement