ఆ ఫీట్‌ పునరావృతం అవుతుంది

Wasim Akram Hopes Pakistan Repeats 1992 Performance Against New Zealand - Sakshi

వసీమ్‌ అక్రమ్‌

బర్మింగ్‌హమ్‌ : టీమిండియాపై ఓటమి అనంతరం పుంజుకొని దక్షిణాఫ్రికాపై విజయం అందుకున్న పాకిస్తాన్‌ తన తదుపరి మ్యాచ్‌ బలమైన న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే వరుస విజయాలతో దూసుకపోతున్న కివీస్‌ను ఓడించడం పాక్‌కు సవాల్‌తో కూడుకున్నదే. అయితే కివీస్‌పై పాక్‌ విజయం సాధించి తీరుతుందని ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో ఎటువంటి మార్పుల్లేకుండా విన్నింగ్‌ టీంనే బరిలోకి దింపాలని  వసీం అక్రమ్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు సూచించాడు. 1992 వరల్డ్‌కప్‌ ఫీట్‌ను పాక్‌ జట్టు పునరావృతం చేస్తుందని అక్రమ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

పాక్‌కు చెందిన మీడియా చానెల్‌తో అక్రమ్‌ మాట్లాడుతూ .. 1992 వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో పాక్‌ చిత్తుచిత్తుగా ఓడించిన విషయాన్ని ఆక్రమ్‌ గుర్తుచేశాడు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డాడు. అలాగే పాక్‌ జట్టు ఫీల్డింగ్‌లో బాగా మెరుగుపడాలని సూచించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 14 క్యాచ్‌లను నేలపాలు చేసి అత్యధిక క్యాచ్‌లను జారవిడిచిన జట్లలో పాక్‌ తొలి స్థానంలో నిలవడం మంచిది కాదని అక్రమ్‌ హెచ్చరించాడు. పాక్‌ టాపార్డర్‌ రాణిస్తున్నప్పటికీ మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ వైపల్యంతో ఓడిపోతున్నామని పేర్కొన్నాడు. ఇక వన్‌డౌన్‌లో వస్తున్న బాబర్‌ అజమ్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమవుతున్నాడని తెలిపాడు.

కాగా, ఇప్పటివరకు పాక్‌ జట్టు 6 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 5 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగతా మాడు మ్యాచ్‌లు తప్పక గెలవడమేగాక ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా కివీస్‌తో పాక్‌ తలపడనుంది.
  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

25-06-2019
Jun 25, 2019, 19:46 IST
ఆసీస్‌ పేస్‌ అటాకింగ్‌కు బెంబేలెత్తుతున్న ఇంగ్లండ్‌ 
25-06-2019
Jun 25, 2019, 18:45 IST
టాపార్డర్‌ జోరును చూసి ఆసీస్‌ 300కి పైగా పరుగులు సాధిస్తుందని భావించారు
25-06-2019
Jun 25, 2019, 18:10 IST
లండన్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతన్న ప్రపంచకప్‌లో ఐపీఎల్‌ స్టార్‌ బౌలర్‌, అఫ్గానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు....
25-06-2019
Jun 25, 2019, 17:00 IST
మాంచెస్టర్‌ : పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తుండగా కండరాలు పట్టేయడంతో టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మధ్యలోనే వెనుతిరిగిన సంగతి తెలిసిందే....
25-06-2019
Jun 25, 2019, 14:43 IST
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు ట్యాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.
25-06-2019
Jun 25, 2019, 14:03 IST
మేటి ఆటగాళ్లంతా ఉన్నా సచిన్‌కు సాధ్యం కానిది ధోని అతడికి కానుకగా ఇచ్చాడు.
25-06-2019
Jun 25, 2019, 11:25 IST
బంగ్లా తర్వాతే మాజీ చాంపియన్లు శ్రీలంక, పాక్, వెస్టిండీస్‌లు కొనసాగడం..
25-06-2019
Jun 25, 2019, 10:28 IST
భారత్‌తో ఓటమి అనంతరం వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌తో
25-06-2019
Jun 25, 2019, 05:00 IST
లార్డ్స్‌: క్రికెట్‌ మక్కాగా పిలవబడే లార్డ్స్‌ మైదానం సమఉజ్జీల సమరానికి వేదిక కానుంది. ప్రపంచ కప్‌లో భాగంగా నేడు డిఫెండింగ్‌...
25-06-2019
Jun 25, 2019, 04:49 IST
భళారే బంగ్లా! షకీబ్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ మాజీ చాంపియన్లను మించిపోయింది. సఫారీ కంటే ఎన్నో రెట్లు...
24-06-2019
Jun 24, 2019, 20:32 IST
లండన్‌: బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఓవరాల్‌ వరల్డ్‌కప్‌లో వెయ్యి పరుగులు సాధించిన తొలి...
24-06-2019
Jun 24, 2019, 20:15 IST
లండన్‌: మోకాలి గాయంతో బాధపడుతున్న వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగాడు. వన్డే వరల్డ్‌కప్‌...
24-06-2019
Jun 24, 2019, 19:26 IST
మాంచెస్ట‌ర్‌: కండరాల నొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌కు స్టాండ్‌ బై ప్లేయర్‌గా న‌వ్‌దీప్ షైనీకి భార‌త క్రికెట్ జ‌ట్టు...
24-06-2019
Jun 24, 2019, 18:40 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ఇప్పటికీ గాయాల బెడద వేధిస్తూనే ఉంది. ఆ...
24-06-2019
Jun 24, 2019, 17:55 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా కొంతమందితోనైనా నోర్లు మూయించామని  పాకిస్తాన్‌ క్రికెట్‌ కోచ్‌...
24-06-2019
Jun 24, 2019, 17:01 IST
లండన్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జోస్‌ బట్లర్‌పై ఆస్ట్రేలియా క్రికెట్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ప్రశంసలు కురిపించాడు. అతనొక అసాధారణమై...
24-06-2019
Jun 24, 2019, 16:33 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో అపజయం లేకుండా దూసుకుపోతున్న భారత క్రికెట్‌ జట్టు తమ తదుపరి పోరులో వెస్టిండీస్‌తో తలపడనుంది. గురువారం...
24-06-2019
Jun 24, 2019, 16:02 IST
సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్‌ చేసిన విధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ...
24-06-2019
Jun 24, 2019, 14:45 IST
సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిని అఫ్గాన్‌...
24-06-2019
Jun 24, 2019, 14:06 IST
సౌతాంప్టన్‌: బంగ్లాదేశ్‌తో నేడు జరుగనున్న మ్యాచ్‌ గురించి అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ గుల్బదీన్‌ నైబ్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ప్రపంచ కప్‌లో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top