ఆ క్రెడిట్ అంతా గౌతమ్ గంభీర్ దే: అక్రమ్ | Wasim Akram gives Gambhir Gambhir credit for Kolkata Knight Riders' (KKR)'s winning streak | Sakshi
Sakshi News home page

ఆ క్రెడిట్ అంతా గౌతమ్ గంభీర్ దే: అక్రమ్

Sep 23 2014 8:16 PM | Updated on Sep 2 2017 1:51 PM

ఆ క్రెడిట్ అంతా గౌతమ్ గంభీర్ దే: అక్రమ్

ఆ క్రెడిట్ అంతా గౌతమ్ గంభీర్ దే: అక్రమ్

చాంఫియన్స్ లీగ్ టీ20 టోర్నమెంట్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును విజయపథాన నడిపిస్తున్న..

హైదరాబాద్: చాంఫియన్స్ లీగ్ టీ20 టోర్నమెంట్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును విజయపథాన నడిపిస్తున్న కెప్టెన్ గౌతమ్ గంభీర్ పై పాకిస్థాన్ క్రికెటర్, బౌలింగ్ కోచ్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. కోల్ కతా విజయం వెనుక గంభీర్ కృషి అభినందనీయమన్నారు. 
 
కోల్ కత్తా జట్టును గెలుపు బాటలో నడిపించిన క్రెడిట్ గంభీర్ కే దక్కుతుందన్నారు. చివరి ఓవర్లలో పరుగులను నియంత్రించి.. వికెట్లు తీసుకోవాలనే గంభీర్ ఆలోచన విధానమే కోల్ కతాకు విజయాన్ని సాధించిపెడుతోందని అక్రమ్ తెలిపారు. కోల్ కతా విజయాన్ని తాను ఆనందిస్తున్నానని.. గెలుపు ఓటములు పట్టించుకోకుండా జట్టు ఒక్కతాటిపైనే ఉందని వసీం అక్రమ్ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement