కోహ్లికి రిచర్డ్స్ మద్దతు | viv richards supports virat kohli | Sakshi
Sakshi News home page

కోహ్లికి రిచర్డ్స్ మద్దతు

Apr 6 2017 5:41 PM | Updated on Sep 5 2017 8:07 AM

కోహ్లికి రిచర్డ్స్ మద్దతు

కోహ్లికి రిచర్డ్స్ మద్దతు

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం ఆ జట్టులోని ఆటగాళ్లతో ఇక స్నేహ భావం లేదంటూ పేర్కొన్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ మద్దతుగా నిలిచాడు

ముంబై:ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం ఆ జట్టులోని ఆటగాళ్లతో  ఇక స్నేహ భావం లేదంటూ పేర్కొని విమర్శల పాలైన  భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ మద్దతుగా నిలిచాడు. ప్రధానంగా భారత్ తో సిరీస్ లో ఆసీస్ తన లైన్ ను అతిక్రమించడమే విరాట్ వ్యాఖ్యలకు ప్రధాన కారణంగా రిచర్డ్స్ అభివర్ణించాడు. భారత్ పర్యటనలో ఆసీస్ ఆటగాళ్ల వ్యవహార శైలిని విరాట్ సీరియస్ గా తీసుకోవడంతోనే అతని వ్యాఖ్యలకు కారణమై ఉండవచ్చని రిచర్డ్స్ అన్నాడు.

'ఆసీస్ క్రికెట్ జట్టు స్లెడ్జింగ్ చేయడంలో లో ఎప్పుడూ దిట్ట.  ప్రధాన ఆటగాళ్లను ముందుగానే లక్ష్యంగా చేసుకుని పైచేయి సాధించడం ఆసీస్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆ క్రమంలోనే భారత్ తో సిరీస్ లో ఆసీస్ హద్దులు దాటి ఉండవచ్చు. అదే సమయంలో స్టార్ ఆటగాడు విరాట్ ను టార్గెట్ చేయడం కూడా అతన్ని ఇబ్బంది పెట్టింది.  దాంతోనే సిరీస్ తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్లు  ఇంకెంత మాత్రమూ  స్నేహితులు కాదంటూ విరాట్ బహిరంగ ప్రకటనకు కారణమై ఉండవచ్చు'అని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంచితే భారత జట్టు తన నంబర్ వన్ ర్యాంకును సుదీర్ఘ కాలం కాపాడుకోవాలంటే విదేశాల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement