మూడు నెలల తర్వాత... | Viswanathan Anand Came To India After Three Months | Sakshi
Sakshi News home page

మూడు నెలల తర్వాత...

May 31 2020 1:07 AM | Updated on May 31 2020 1:07 AM

Viswanathan Anand Came To India After Three Months - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎట్టకేలకు భారత చెస్‌ దిగ్గజం, ప్రపంచ మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ శనివారం స్వదేశానికి చేరుకున్నాడు. కరోనా నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు విధించడంతో ఆనంద్‌ మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయాడు. శుక్రవారం రాత్రి ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానంలో (ఏఐ–120) బయల్దేరిన ఆనంద్‌ ఢిల్లీ మీదుగా శనివారం మధ్యాహ్నం బెంగళూరులోకి కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య అరుణ ధ్రువీకరించింది. చాలా రోజుల తర్వాత భారత్‌కు రావడం పట్ల ఆనంద్‌ సంతోషంగా ఉన్నాడని తెలిపిన ఆమె... కర్ణాటక నిబంధనల ప్రకారం క్వారంటైన్‌ పూర్తి చేసి తమ స్వస్థలమైన చెన్నైకి చేరుకుంటాడని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement