జ్యూరిచ్ చెస్ టోర్నీ చాంప్ ఆనంద్ | Viswanathan Anand | Sakshi
Sakshi News home page

జ్యూరిచ్ చెస్ టోర్నీ చాంప్ ఆనంద్

Feb 19 2015 12:53 AM | Updated on Sep 2 2017 9:32 PM

భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో ఆనంద్ విజేతగా నిలిచాడు.

జ్యూరిచ్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో ఆనంద్ విజేతగా నిలిచాడు.
 
 సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో బుధవారం జరిగిన చివరిదైన ఐదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 42 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని మొత్తం 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హికారు నకముర (అమెరికా) 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement