'కోహ్లి.. నీ ప్రవర్తన మార్చుకో' | Virat Kohli Should Behave Better, Says Geoff Lawson | Sakshi
Sakshi News home page

'కోహ్లి.. నీ ప్రవర్తన మార్చుకో'

Mar 23 2017 11:28 AM | Updated on Sep 5 2017 6:54 AM

'కోహ్లి.. నీ ప్రవర్తన మార్చుకో'

'కోహ్లి.. నీ ప్రవర్తన మార్చుకో'

క్రికెట్ ఫీల్డ్లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రవర్తించే తీరు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జెఫ్ లాసన్కు నచ్చలేదట.

సిడ్నీ:క్రికెట్ ఫీల్డ్లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రవర్తించే తీరు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జెఫ్ లాసన్కు నచ్చలేదట. ప్రధానంగా తమతో జరుగుతున్న టెస్టు సిరీస్లో కోహ్లి ప్రవర్తన తన ఆశ్చర్యానికి గురి చేస్తుందని లాసన్ పేర్కొన్నాడు. ఈ మేరకు విరాట్ తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ విమర్శలు గుప్పించాడు. 'ఒక జట్టు కెప్టెన్గా విరాట్ పై చాలా బాధ్యత ఉంది. ఆ రకంగానే విరాట్ ముందుకు వెళితే మంచిది. ప్రస్తుతం నువ్వు ప్రవర్తిస్తున్న తీరు 'చెత్త' ఆటగాడి అప్రథను మోసుకోస్తుంది. నీ ప్రవర్తనను మెరుగుపరుచుకో' అని లాసన్ హితబోధ చేశాడు. 

 

ఈ సందర్భంగా బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో చోటు చేసుకున్న విషయాల్ని లాసన్ ప్రస్తావించాడు. 'బెంగళూరు టెస్టులో విరాట్ కోహ్లి ప్రవర్తన అనుచితంగా ఉంది. ఆసీస్ క్రికెటర్ల పట్ల చెడుగా ప్రవర్తించాడు. అతని భాష బాలేదు. రెండో టెస్టులో విరాట్ తన ప్రవర్తనతో కెమెరాకు చిక్కినా అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసీస్ క్రికెటర్లు ఫీల్డ్ ను విడిచి వెళ్లే క్రమంలో కోహ్లి వారికి సెండాఫ్ తీరు చెప్పే తీరు బాలేదు. దీనిపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు కూడా పట్టించుకోలేదు. ఈ తరహా ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు' అని లాసన్ పేర్కొన్నాడు. దాంతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ల్లో మాట్లాడేటప్పుడు కూడా కోహ్లి మర్యాదను పాటిస్తే మంచిదన్నాడు. ఒక క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న విరాట్ హుందాగా వ్యవరిస్తే మంచిదన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement