విరాట్ ర్యాంకు పదిలం | Virat Kohli retains No.2 spot, Rohit Sharma slips in ODI rankings | Sakshi
Sakshi News home page

విరాట్ ర్యాంకు పదిలం

Sep 6 2016 12:14 PM | Updated on Sep 4 2017 12:26 PM

విరాట్ ర్యాంకు పదిలం

విరాట్ ర్యాంకు పదిలం

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వన్డేల్లో తన ర్యాంకును నిలుపుకున్నాడు.

దుబాయ్:టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వన్డేల్లో తన ర్యాంకును నిలుపుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ తన రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు.  విరాట్ 813 రేటింగ్ పాయింట్లతో తన రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకోగా, మరో ఆటగాడు రోహిత్ శర్మ ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయాడు.

 

ప్రస్తుతం ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ దేశానికే చెందిన హషీమ్ ఆమ్లా మూడో స్థానంలో నిలిచాడు. కాగా, ఇటీవల పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో రాణించిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఆ సిరీస్లో 274 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ అవార్డు గెలుచుకున్న జో రూట్ టాప్-5 లో నిలవడం ఇదే తొలిసారి.

Advertisement
 
Advertisement
Advertisement