రంజీ క్రికెటర్ గాదె హనుమ విహారి తొలి సారి ఇంగ్లండ్ కౌంటీ లీగ్‌లలో ఆడనున్నాడు.
హటన్ సీసీ జట్టుకు ప్రాతినిధ్యం
సాక్షి, హైదరాబాద్: రంజీ క్రికెటర్ గాదె హనుమ విహారి తొలి సారి ఇంగ్లండ్ కౌంటీ లీగ్‌లలో ఆడనున్నాడు. ఎసెక్స్ కౌంటీ పరిధిలోని హటన్ క్రికెట్ క్లబ్‌కు అతను ప్రాతినిధ్యం వహిస్తాడు. మొత్తం 18 వారాల పాటు అతను ఈ లీగ్‌లలో పాల్గొంటాడు. ఇందులో భాగంగా ఫస్ట్ డివిజన్ స్థాయి గల 18 వన్డేల్లో విహారికి ఆడే అవకాశం దక్కుతుంది.
ఇంగ్లండ్‌లోని స్వింగ్, సీమ్ వికెట్లపై మ్యాచ్‌లు ఆడటం ద్వారా మంచి అనుభవం దక్కుతుందని, ఇది భవిష్యత్తులో తన కెరీర్‌కు ఉపయోగపడుతుందని విహారి విశ్వాసం వ్యక్తం చేశాడు. శనివారం అతను ఇంగ్లండ్ బయల్దేరి వెళతాడు. 20 ఏళ్ల విహారి... 23 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 51.09 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 19 దేశవాళీ వన్డేల్లో 36.80 సగటుతో 552 పరుగులు సాధించాడు.