
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో (County Championship) టీమిండియా వెటరన్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) తన తొలి సెంచరీ పూర్తి చేశాడు. స్వల్ప కాలిక ఒప్పందం మేరకు యార్క్‌షైర్ (Yorkshire) కౌంటీతో జతకట్టిన అతను.. డర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు.
ఈ ఇన్నింగ్స్‌లో మయాంక్ సిక్సర్‌తో సెంచరీని పూర్తి చేశాడు. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో మయాంక్‌కు ఇది 19వ శతకం. ఈ ఇన్నింగ్స్‌లో మయాంక్ 141 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేసిన అనంతరం ఔటయ్యాడు.
MAYANK AGARWAL COMPLETED HIS MAIDEN HUNDRED IN COUNTY CRICKET WITH A SIX. 👑 pic.twitter.com/lGUjYXGV9N
— Johns. (@CricCrazyJohns) September 25, 2025
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్.. 346 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో నంబర్ ఆటగాడు బెన్ రెయిన్ (101) సెంచరీతో కదంతొక్కగా.. బెడింగ్హమ్ (93) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. విల్ రోడ్స్ (50) అర్ద సెంచరీతో రాణించాడు. యార్క్‌షైర్ బౌలర్లలో జాక్ వైట్ 5 వికెట్లతో సత్తా చాటగా.. జార్జ్ హిల్ 2, మిల్నెస్, జెఫ్ థామ్సన్, డామ్ బెస్ తలో వికెట్ తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స ప్రారంభించిన యార్క్‌షైర్ రెండో రోజు మూడో సెషన్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (116), ఆడమ్ లిత్ (69), ఫిన్లే బీన్ (1), జానీ బెయిర్‌స్టో (0) ఔట్ కాగా.. జేమ్స్ వాట్సన్ (19), మాథ్యూ రెవిస్ (2) క్రీజ్‌లో ఉన్నారు. డర్హమ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు యార్క్‌షైర్ ఇంకా 143 పరుగులు వెనుకపడి ఉంది.