కామన్వెల్త్‌ గేమ్స్‌: భారత్‌కు మరో స్వర్ణం

Venkat Rahul Ragala wins Gold IN Commonwealth Games 2018 - Sakshi

గోల్డ్‌కోస్ట్‌ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ మరో స్వర్ణం సాధించింది. పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 85 కేజీల విభాగంలో తెలుగబ్బాయి వెంకట్‌ రాహుల్‌ రాగల స్వర్ణం సాధించాడు. స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జర్క్‌ ల్లో భాగంగా మొత్తం 338 కేజీలను ఎత్తిన వెంకట్‌ రాహుల్‌ పసిడిని తన ఖాతాలో వేసుకున్నాడు. ​​దీంతో భారత్‌ స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే ఈ నాలుగు బంగారు పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్‌లో రావడం విశేషమైతే ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్‌కు వచ్చిన ఆరు పతకాలు కూడా వెయిలిఫ్టింగ్‌లోనే రావడం మరో విశేషం.ఇక రాహుల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వాడు.

తొలి రోజు  మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి చాను , రెండో రోజు 48 కేజీల విభాగంలో సంజిత చాను, శనివారం 77 కేజీల విభాగం పోటీల్లో సతీశ్‌ కుమార్‌ శివలింగంతో పాటు వెంకట్‌ రాహుల్‌లు పసిడితో మెరిశారు. ఇక పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో మొదటి రోజు గురురాజా రజతం సాధించి శుభారంభం అందించగా, రెండో రోజు శుక్రవారం 69 కేజీల విభాగంలో 18 ఏళ్ల దీపక్‌ లాథర్‌ కాంస్యం సాధించడంతో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు సొంతమయ్యాయి.

రాహుల్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు
పసిడి సాధించిన తెలుగబ్బాయి వెంకట్‌ రాహుల్‌ రాగలకు  ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. రాహుల్‌ స్వర్ణం గెలిచి దేశం గర్వించేలా చేశాడని కొనియాడారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top