సెయింట్ ఆండ్రూస్ ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నీ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది.
జింఖానా, న్యూస్‌లైన్: సెయింట్ ఆండ్రూస్ ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నీ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది.
ఆరు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్, పల్లవి మోడల్ స్కూల్, డాన్ బాస్కో, ఎంఎస్‌బీ, జైన్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూల్, మార్నింగ్ స్టార్, సెయింట్ మైకేల్ స్కూల్ జట్లు పాల్గోనున్నాయి. టోర్నీలో జట్టు ప్రదర్శనకే కాక వ్యక్తిగతంగా సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి అత్యంత విలువైన ఆటగాడిగా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టోర్నీలో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ తరఫున భారత మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్ ముఖ్య కార్యనిర్వాహకుడిగా వ్యవహరించనున్నారు.
ఖోఖో శిక్షణా శిబిరం...
ఉస్మానియా యూనివర్సిటీ ఈ నెల 31 నుంచి మహిళల ఖోఖో శిక్షణా శిబిరం నిర్వహించనుంది. ఈ శిబిరం కోఠి ఉమెన్స్ కాలేజీలో జరగనుంది. ఆసక్తి గలవారు ఆరోజు సాయంత్రం 4 గంటలకు హాజరుకావాలి. మరిన్ని వివరాలకు ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ సెక్రటరీ ప్రొఫెసర్ ఎల్‌బీ లక్ష్మీకాంత్ రాథోడ్‌ను సంప్రదించాలి.