కావాలనే టైమ్‌ వృథా చేశా: డిక్వెల్లా | time wasting tactics in Eden Test were intentional, concedes Niroshan Dickwella | Sakshi
Sakshi News home page

కావాలనే టైమ్‌ వృథా చేశా: డిక్వెల్లా

Nov 23 2017 1:10 PM | Updated on Nov 9 2018 6:43 PM

time wasting tactics in Eden Test were intentional, concedes Niroshan Dickwella - Sakshi

కోల్‌ కతా:భారత్‌ తో జరిగిన తొలి టెస్టు ఆఖరి రోజు కావాలనే సమయం వృథా చేశానని శ్రీలంక ఆటగాడు నిరోషాన్‌ డిక్వెల్లా స్పష్టం చేశాడు. దానిలో భాగంగానే కొన్ని ఎత్తుగడలు అవలంభిచానని తెలిపాడు. ‘ఓ వైపు వికెట్లు పడుతున్నాయి. భారత్‌లో ముగ్గురు అత్యుత్తమ పేసర్లు ఉన్నారు. వికెట్‌ను కాపాడుకోవడం కంటే పేస్ బౌలింగ్‌లో ఎదురు దాడి చేయడమే బెస్ట్ డిఫెన్స్ అనిపించింది. షమీ ఓవర్లో స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదాను. నిబంధనలకు విరుద్ధంగా లెగ్ సైడ్ లో స్క్వేర్ వెనుక ముగ్గురు ఫీల్డర్లు ఉన్న విషయం గుర్తించి అంపైర్ నిగెల్ లాంగ్‌కు చెప్పాను.

దీంతో నోబాల్ ప్రకటించారు. వెంటనే కోహ్లి నా దగ్గరకు వచ్చి అది అంపైర్ల పని, నీపని నువ్వు చూసుకో అన్నాడు. అప్పుడే డ్రామా మొదలైంద’ని డిక్వెలా తెలిపాడు. ఆ క్రమంలోనే టైం వేస్ట్ చేయడానికి ఇదే సరైన అవకాశం అనిపించిందన‍్నాడు. దాంతోనే సమయం వృథా చేసేందుకు పదే పదే యత్నించినట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే భారత పేసర​ షమీతో బౌలింగ్ రన్నప్‌ విషయంలో గొడవైందన్నాడు. తాను సమయం తీసుకోవడం వేగంగా బంతులు వేయాలనుకునే భారత​ క్రికెట్‌ జట్టుకు నచ్చలేదన్నాడు.కాగా, తమ కెప్టెన్‌ మాత్రం కామ్‌ గా ఉండిమని చెప్పడంతో తాను ఎటువంటి వాగ్వాదానికి దిగలేదన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement