సెమీస్‌లో పేస్‌ జంట | The Leander Paes duo reached the semi-finals at the Antalya Open tennis tournament. | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో పేస్‌ జంట

Jun 29 2017 12:16 AM | Updated on Sep 5 2017 2:42 PM

అంటాల్యా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–ఆదిల్‌ షమస్దీన్‌ (కెనడా) ద్వయం సెమీఫైనల్‌కు చేరింది.

న్యూఢిల్లీ:  అంటాల్యా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–ఆదిల్‌ షమస్దీన్‌ (కెనడా) ద్వయం సెమీఫైనల్‌కు చేరింది. టర్కీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో పేస్‌–షమస్దీన్‌ జంట 6–1, 6–2తో బెర్లోక్‌ (అర్జెంటీనా)–జోవో సుసా (పోర్చుగల్‌) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో దివిజ్‌ శరణ్‌–పురవ్‌ రాజా (భారత్‌) జంట 6–7 (9/11), 7–6 (7/4), 4–10తో మాట్‌ పావిక్‌ (క్రొయేషియా)–ఒలివెర్‌ మరాచ్‌ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బగ్దాటిస్‌తో రామ్‌కుమార్‌ ఆడతాడు.

Advertisement
 
Advertisement
Advertisement