రాష్ట్ర ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా సొహైల్‌ | Telangana State School Football Team Announced | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా సొహైల్‌

Feb 14 2019 8:42 AM | Updated on Feb 14 2019 8:42 AM

Telangana State School Football Team Announced - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ ఇండియా కప్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర స్కూల్స్‌ టీమ్‌ను బుధవారం ప్రకటించారు. ఈ జట్టుకు వీనస్‌ హైస్కూల్‌కు చెందిన రయ్యన్‌ బిన్‌ సొహైల్‌ కెప్టెన్‌గా, కేవీఎస్‌కు చెందిన వినీత్‌ పాండే వైస్‌ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. మేనేజర్‌గా ఎంఏ మనన్‌ మిరాజ్, కోచ్‌గా సయ్యద్‌ హసన్‌ నవాజ్‌ వ్యవహరించనున్నారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఈనెల 15 నుంచి 21 వరకు స్కూల్‌ ఇండియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ జరుగుతుంది.  
జట్టు వివరాలు: అబ్బాస్‌ హుస్సేన్‌ (సెయింట్‌ మేషమ్‌ హైస్కూల్‌), మొహమ్మద్‌ ఇబ్రహీం, అబ్దుల్‌ సత్తార్, ఇంతియాజ్‌ అహ్మద్, మొహమ్మద్‌ ఇబ్రహీం ఖాన్‌ (గోల్కొండ స్కూల్‌), ఒమ్రాన్‌ కసాడి (స్ప్రింగ్‌ఫీల్డ్‌ స్కూల్‌), డి. నవీన్, ఎస్‌. శ్రీకాంత్‌ (కుల్సుంపురా ప్రభుత్వ పాఠశాల), నిఖిత్‌ (ఆల్‌సెయింట్స్‌ హైస్కూల్‌), రయ్యన్‌ బిన్‌ సొహైల్‌ (వీనస్‌ హైస్కూల్‌), వినీత్‌ పాండే, ఆర్యమన్‌ యాదవ్‌ (కేవీఎస్, హకీంపేట్‌), ప్రదీప్‌ (ఉషోదయ హైస్కూల్‌), హంజా ఇబ్రహీం అలీ (గ్రీన్‌విచ్‌ అకాడమీ), అలీ అక్బర్‌ (ఫోకస్‌ హైస్కూల్‌), షరీఖ్‌ ముసద్దిక్‌ (ఇన్‌సైట్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌), అబ్దుల్‌ రహమాన్‌ బిన్‌ (గుడ్‌ ఫెయిత్‌ హైస్కూల్‌), సయ్యద్‌ ఒమర్‌ అలీ (ది ప్రోగ్రెస్‌ హైస్కూల్‌).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement