సిడ్నీ టెస్ట్‌; భారత జట్టు ఇదే | Team India Name 13-man squad for Sydney Test | Sakshi
Sakshi News home page

Jan 2 2019 10:53 AM | Updated on Jan 2 2019 10:57 AM

Team India Name 13-man squad for Sydney Test - Sakshi

ఆస్ట్రేలియాతో రేపటి నుంచి సిడ్నీలో జరగనున్న నాలుగో టెస్టుకు 13 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

సిడ్నీ: ఆస్ట్రేలియాతో రేపటి నుంచి సిడ్నీలో జరగనున్న నాలుగో టెస్టుకు 13 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఇషాంత్‌ శర్మను జట్టు నుంచి తప్పించింది. అతడికి ఫిట్‌నెస్‌ లేదని ప్రకటించింది. గాయపడ్డడా, అనారోగ్యంతో బాధ పడుతున్నాడా అనేది వెల్లడించలేదు. (ఈసారి వ‌ద‌లొద్దు..)

అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో పార్శపు నొప్పి(సైడ్‌ స్ట్రెయిన్‌)తో జట్టుకు దూరమైన అశ్విన్‌కు అవకాశం దక్కింది. రెండు, మూడు టెస్టులు ఆడలేకపోయిన అతడికి చివరి టెస్ట్‌లో ఛాన్స్‌ ఇచ్చారు. అశ్విన్‌ తుది జట్టులో ఉంటాడా, లేదా అనేది మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నిర్ణయిస్తామని బీసీసీఐ తెలిపింది. వ్యక్తిగత కారణాలతో రోహిత్‌ శర్మ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. తనకు కూతురు పుట్టడంతో అతడు స్వదేశానికి వచ్చాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో పైచేయి సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ ఫలితం తేలకున్నా సిరీస్‌ భారత్‌ సొంతమవుతుంది.

బీసీసీఐ ప్రకటించిన జట్టు
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), ఛతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement