పద్మభూషణ్‌కు సుశీల్ పేరు | Sushil name for Padma Bhushan | Sakshi
Sakshi News home page

పద్మభూషణ్‌కు సుశీల్ పేరు

Sep 7 2016 12:51 AM | Updated on Oct 17 2018 6:27 PM

పద్మభూషణ్‌కు సుశీల్ పేరు - Sakshi

పద్మభూషణ్‌కు సుశీల్ పేరు

ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేశారు.

న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేశారు. వ్యక్తిగత విభాగంలో రెండు సార్లు ఒలింపిక్స్ పతకం అందుకున్న ఏకై క అథ్లెట్‌గా 33 ఏళ్ల సుశీల్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

అలాగే సుశీల్‌తో పాటు అతడి కోచ్ యశ్వీర్ సింగ్, మహిళా రెజ్లర్ అల్కా తోమర్ పేర్లను కూడా దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) ప్రతిపాదించింది. ఈ మగ్గురి పేర్లను గత నెలలోనే కేంద్రానికి పంపినట్టు సమాఖ్య సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. రెండేళ్ల క్రితమే సుశీల్ పేరును ఈ పురస్కారానికి పంపినా తిరస్కరించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement